LATEST ARTICLES

హైడ్రా మళ్ళీ షురూ – కమిషనర్ రంగనాథ్ 

0

హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్ 28: హైడ్రా కూల్చివేతలు ఆగవని కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మధుర నగర్ లో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్ లో లేదని అక్కడ చెరువే లేదు అని ఆయన పేర్కొన్నారు. హైడ్రా పై ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉన్నపటికీ అనవసరంగా సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేస్తున్నారు. నిజానికి హైడ్రా వల్ల చాలా మంచి జరిగింది అని కమీషనర్ తెలిపారు.

ఎఫ్.టి.ఎల్ (FTL) గుర్తింపు తర్వాత హైడ్రా కూల్చివేతలు మొదలవుతాయి. హైడ్రాతో 15 టీమ్స్ కలిగి ఉందని, హైడ్రో నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఆయన వివరించారు. ఇప్పటి వరకు హైడ్రా 200 ఎకరాల భూమిని కాపాడిందని, ఇప్పటి వరకు 5800 ల్యాండ్ కబ్జాల పై ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా వార్షిక నివేదికలో కమిషనర్ రంగనాధ్ తెలిపారు.

మెడికవర్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు

0

హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్ 12: మెదడులో ఏర్పడిన అత్యంత క్లిష్టమైన ట్యూమర్ (మెడులో బ్లాస్టోమా)ను హైటెక్ సిటీ మెడికవర్ దవాఖాన వైద్యులు విజయవంతంగా తొలగించి 12 ఏండ్ల ఆక్షర ప్రాణాలు కాపాడారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం దవాఖానలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు.

అక్షర తరగతి గదిలో తరచుగా నిద్రపోవడం గుర్తించిన ఉపాధ్యాయులు తల్లితండ్రులకు తెలియజేశారు. చిన్నారి వైద్యులకు చూపించగా ఆమె చిన్న మెదడు భాగంలో మెడులోబ్లాస్టోమా అను ట్యూమర్ను గుర్తించారు. కాగా ట్యూమర్ తొలగింపు అత్యంత క్లిష్టమైనదని, శస్త్ర చికిత్స సమయంలో పక్షవాతం లేదా ప్రాణాపాయం వంటి సమస్యలున్నప్పటికీ మెడికవర్ వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ట్యూమర్ను తొలగించారు.

చికిత్స అనంతరం అక్షర హైడ్రోసెఫలస్ అనే సమస్యకు గురవడంతో వెంట్రికులో పెరిటోనియల్ (వీపీ) షంట్ సర్జరీని చేశారు. సర్జరీ అనంతరం అక్షర వెచ్చింది. మూడు నెలలుగా కోమాలో ఉన్న అక్షరకు మెరుగైన చికిత్స అందిస్తుండడంతో ఆకస్మాత్తుగా మేల్కొని తన తండ్రితో మాట్లాడింది. అనంతరం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా, అక్షర కోలుకున్నట్లు, ట్యూమర్ సైతం పూర్తిగా తొలగిపోయినట్లు నిర్ధారించినట్లు వైద్యులు తెలిపారు.

జాతీయ స్పీడ్ రోలర్ స్కేటింగ్ లో 2 రజత పతకాలు

0

*జాతీయ స్పీడ్ రోలర్ స్కేటింగ్ లో 2 రజత పతకాలు.సాధించిన హైదరాబాద్ విద్యార్ధి

హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్ 12 : మైసూర్ లో డిసెంబర్ 05 నుంచి 11 వరకు జరిగిన 62వ జాతీయ స్పీడ్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్-2024లో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన గుడ్ల అర్ణవ్ 2 రజత పతకాలతో మొదటి స్థానంలో నిలిచాడు. సికింద్రాబాద్ మచ్చబొల్లారానికి చెందిన గుడ్ల అర్ణవ్ ఆల్వాల్ లోని భాష్యం స్కూల్ లో 5 వ తరగతి చదువుతున్నాడు. కాగా అర్ణవ్ ఇప్పటి వరకు జిల్లా నుండి 3 రజత పథకాలు,రాష్ట్ర స్థాయిలో 5 బంగారు పథకాలు సాధించాడు. ఓపెన్ నేషనల్ స్కేటింగ్ రేసింగ్ లో 2 రజత పతకాలు సాధించాడు.

హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

0

గచ్చిబౌలి, ది న్యూస్ టుడే,డిసెంబర్ 5: గచ్చిబౌలి కొండాపూర్ పాడీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న హరిష్ రావు. పోలీసులతో వాగ్వాదంతో ఉద్రితంగా మారిన అరెస్ట్.

గేటు దుకి లోపలికి వెళ్లిన ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు గేటు తేరవాలని నినాదాలు చేసిన కోత్త ప్రభాకర్ రెడ్డి.

హరిష్ రావు అరెస్టు చేసి లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో గేటు వద్ద అడ్డుకున్న బిఅర్ఎస్ పార్టీ శ్రేణులు. పోలిస్ వాహనాన్ని పోనియ్యకుండా తివ్రంగా అడ్డుకున్న బిఅర్ఎస్ నాయకులు.

హరిష్ రావు,శంభిపుర్ రాజు,కోత్త ప్రభాకర్ రెడ్డి జగదీష్ రెడ్డి లను అరెస్టు చేసి గచ్చిబౌలికి తరలించిన పోలీసులు. పాడి కౌశిక్ రెడ్డి ని అదుపులోకి తిసుకున్న బంజారాహిల్స్ పోలీసులు. ఇంటి నుంచి పాడి కౌశిక్ రెడ్డిని తరలించిన బంజారాహిల్స్ పోలీసులు..

విద్యార్థినీలను వేధించిన శ్రీ చైతన్య వైస్ ప్రిన్సిపాల్

0

హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్2 : నిత్యం ఏదో వివాదాల్లో శ్రీ చైతన్య కాలేజీ లు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మదినగూడలో విద్యార్థులను వేధించిన వైస్ ప్రిన్సిపల్ శివ. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోటోలు తీసి బెదిరించడం మార్కులు తగ్గిస్తానని పలు రకాలుగా ఇబ్బంది పెట్టేవాడని స్టూడెంట్స్ ఆరోపించారు.

అవసరం లేకపోయినా 7గం వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ..మీ మోకాలకు ఐపీ ఎగ్జామ్స్ ఎక్కువ మెయిన్స్ అవసరమా అని తిట్టేవారు అంతేకాకుండా మంత్లీ 95% అటెండెన్స్ ఉండాలని లేకపోతే మర్క్స్ కట్ చేస్తామని పదే పదే బెదిరిస్తారని విద్యార్థినిలు వాపోయారు. మంత్ టైమ్ లొ ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. స్నాప్ చాట్ లొ ఇబ్బందికరంగా చాట్ చేస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజ్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకున్నారు.

ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య 

0

ములుగు,ది న్యూస్ టుడే, డిసెంబర్ 2: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని రిసార్ట్‌లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో హరీశ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఈ కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు..

నిన్న రాత్రి తన ప్రియురాలితో హరిత రిసార్ట్‌కి వెళ్ళిన వాజేడు ఎస్సై హరీష్. ఈ నెల 14న హరీష్ ఎంగేజ్మెంట్ జరగనుంది. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయాడని అనుమానిస్తున్నారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్సై సూసైడ్ చేసుకోవడంతో కలకలం

గత నెలలో హరీష్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసారు. అప్పటి నుండి ప్రెజర్లో ఉన్నాడని స్థానిక సమాచారం.

ఎస్సై హరీష్ ఆత్మహత్య పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

0

గచ్చిబౌలి, ది న్యూస్ టుడే, డిసెంబర్ 1: గచ్చిబౌలి పరిధిలో శ్రీరాం నగర్ సి బ్లాక్ ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకున్న బుల్లి తెర నటి శోభిత. పోలీస్ ల వివరాల ప్రకారం..కర్ణాటక లోని సక్లేష్ పూర్ కి చెందిన శోబిత భర్త సుధీర్ తో కలిసి శ్రీరాం నగర్ కాలనీలో నివాసం ఉంటుంది.గతేడాది పెళ్లి చేసుకున్నా శోభిత.

బ్రహ్మగంతు,నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత.

పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హస్పటల్ మృతదేహం అనంతరం బెంగళూరుకు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు.

తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత వ్యాఖ్యలు నిషేధం 

0

తిరుమల, ది న్యూస్ టుడే,నవంబరు 30: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ తీర్మానం చేసింది.

నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో, గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది, దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం సర్వసాధారణం అయింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం

తిరుమలకు విచ్చేసి రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ తెలిపింది.

అలరించిన ‘శంభు కింకిణి’ నృత్యోత్సవాలు

0

మాదాపూర్,ది న్యూస్ టుడే,నవంబర్ 30 : వినసొంపైన సంగీతానికి అనుగుణంగా కనువిందు చేసే నృత్య ప్రదర్శనలతో ‘శంభు కింకిణి’ నృత్యోత్సవం ఆధ్యాంతం ఆకట్టుకుంది. మాదాపూర్ లోని శిల్పారామంలో శనివారం పద్మకల్యాణ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శంభు కింకిణి నృత్యోత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వహకులు తెలిపారు. మొదటి రోజున ఆరుణ స్వరూప్ మండోదరి శబ్దం, ఎంతచక్కని వాడే, జావళిలను కూచిపూడి నృత్య రూపకంలో ప్రదర్శించి ఆకట్టుకోగా, డెబీజాని బసు శివస్తుతి, తీవ్రాల్, తుమ్రి, తులసి దాస్భజన్లను కథక్ నృత్య, రూపకంలో నర్తించి అలరించింది. శోభన మిత్ర దాస్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఉమెన్ ఉడ్ను మణిపురి నృత్యరీతిల, సాయి మనస్విని ఆంధ్రనాట్యం ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నృత్యోత్సవాలను తెలుగు యూనివర్సిటీ

విద్యార్థిని పట్ల శ్రీ చైతన్య లెక్చరర్ అసభ్య ప్రవర్తన

0

హైదరాబాద్, ది న్యూస్ టుడే, నవంబర్ 30: శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలలో విద్యార్థులపై వేధింపులు ఆత్మహత్యలు మామూలుగా మారాయి. మియాపూర్ కల్వరి టెంపుల్ క్యాంపస్ లో జరిగిన ఘటన మరువకముందే.. తాజాగా మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని పట్ల లెక్చరర్ సభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యత విద్యార్థిని వారి తల్లిదండ్రులతో పాటు వివిధ విద్యార్థి సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న హరీష్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని వేధిస్తున్నట్లు మెసేజ్ చేస్తున్నారని తెలిపారు.

మెసేజ్లలో ఎక్కడ కలుద్దాం ఎప్పుడు కలుద్దాం మీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని సంభాషణతో మెసేజ్ చేసేవాడని తెలిపారు. ఈ విషయాలు బయటికి తెలిస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాలని, ఈ విషయంపై తల్లిదండ్రులు కంప్లీట్ చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కాలేజీ ఎదుట విద్యార్థిలు వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజీకి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు.