హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్ 28: హైడ్రా కూల్చివేతలు ఆగవని కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మధుర నగర్ లో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్ లో లేదని అక్కడ చెరువే లేదు అని ఆయన పేర్కొన్నారు. హైడ్రా పై ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉన్నపటికీ అనవసరంగా సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేస్తున్నారు. నిజానికి హైడ్రా వల్ల చాలా మంచి జరిగింది అని కమీషనర్ తెలిపారు.
ఎఫ్.టి.ఎల్ (FTL) గుర్తింపు తర్వాత హైడ్రా కూల్చివేతలు మొదలవుతాయి. హైడ్రాతో 15 టీమ్స్ కలిగి ఉందని, హైడ్రో నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఆయన వివరించారు. ఇప్పటి వరకు హైడ్రా 200 ఎకరాల భూమిని కాపాడిందని, ఇప్పటి వరకు 5800 ల్యాండ్ కబ్జాల పై ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా వార్షిక నివేదికలో కమిషనర్ రంగనాధ్ తెలిపారు.