ములుగు,ది న్యూస్ టుడే, డిసెంబర్ 2: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఈ కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు..
నిన్న రాత్రి తన ప్రియురాలితో హరిత రిసార్ట్‌కి వెళ్ళిన వాజేడు ఎస్సై హరీష్. ఈ నెల 14న హరీష్ ఎంగేజ్మెంట్ జరగనుంది. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయాడని అనుమానిస్తున్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్సై సూసైడ్ చేసుకోవడంతో కలకలం
గత నెలలో హరీష్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసారు. అప్పటి నుండి ప్రెజర్లో ఉన్నాడని స్థానిక సమాచారం.
ఎస్సై హరీష్ ఆత్మహత్య పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.