హౌసింగ్ సొసైటీల భూ కేటాయింపులను ఎస్సీ రద్దు చేసింది

0

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే, నవంబర్ 26 : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని హౌసింగ్‌ సొసైటీలకు చేసిన పలు భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు జర్నలిస్టులకు మంజూరు చేసిన కేటాయింపులపై ప్రభావం చూపుతుంది.

బాధిత సంఘాలు, వారి సభ్యులు డిపాజిట్ చేసిన మొత్తాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ సొసైటీలకు అనుకూలంగా రాష్ట్రం అమలు చేసిన లీజు డీడ్‌లను కూడా ఈ తీర్పు రద్దు చేసింది.

కీలక తీర్పు వివరాలు..

2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రొఫెసర్ కేశవ రావ్ జాదవ్ చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణ రాష్ట్రం, సహకార సంఘాలు, వాటి సభ్యులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.

ప్రాథమిక ధరలకు భూ కేటాయింపులకు అర్హులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధికారులు, న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులను ప్రత్యేక కేటగిరీగా వర్గీకరించిన అనేక ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.M.లు) ఈ తీర్పు చెల్లదు. వీటిలో G.O.Mలు ఉన్నాయి. నం. 243 మరియు 244 (ఫిబ్రవరి 28, 2005 తేదీ) మరియు G.O.Ms. నం. 419, 420, 422 నుండి 425, మరియు 551 (మార్చి 2008లో జారీ చేయబడింది). ఈ ఉత్తర్వులు చట్టం ముందు సమానత్వాన్ని నిర్ధారించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించాయని కోర్టు పేర్కొంది.

వాపసు మరియు పరిహారం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్తించే రేట్లను మించని వడ్డీతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు డెవలప్‌మెంట్ ఛార్జీలతో సహా సొసైటీలు చేసిన అన్ని డిపాజిట్లను తిరిగి చెల్లించాలని కోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ రీఫండ్‌లు ఆదాయపు పన్ను రిటర్న్‌ల ద్వారా ధృవీకరించబడిన ధృవీకరించబడిన ఖాతా పుస్తకాల ఆధారంగా లెక్కించబడతాయి.

భూ కేటాయింపులపై ప్రభావం..

తీర్పు యొక్క పరిశీలనలను గౌరవిస్తూ చట్టం ప్రకారం ప్రభావితమైన భూములను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్పు అనుమతిస్తుంది. ఈ నిర్ణయం జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వంటి సొసైటీల సభ్యులకు కేటాయించిన ప్లాట్‌ల చట్టపరమైన స్థితిపై అనిశ్చితిని కలిగించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సెప్టెంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేయడం గమనార్హం. అయితే, సుప్రీంకోర్టు తీర్పు అటువంటి కేటాయింపుల పారదర్శకత మరియు చట్టబద్ధత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది.

జర్నలిస్టులు మరియు ప్రభుత్వ అధికారులతో సహా కేటాయించిన వారు ఇప్పుడు వారి క్లెయిమ్‌ల గురించి అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు, రాష్ట్ర భూ కేటాయింపు విధానాలలో స్పష్టత మరియు జవాబుదారీతనం యొక్క అవసరాన్ని ఎత్తిచూపారు.

జైపూర్‌‌పై పట్నా పైరేట్స్‌ విజయం

0

జైపూర్‌‌పై పట్నా పైరేట్స్‌ విజయం.

అర్జున్‌ దేశ్వాల్‌ 20 పాయింట్ల పోరాటం వృథా

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే, నవంబర్08 : ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)  11వ సీజన్‌ లో పట్నా పైరేట్స్ జట్టు నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన లీగ్ పోరులో ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జైపూర్ పింక్ పాంథర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా 43–41 తేడాతో  పింక్ పాంథర్స్‌ ను ఓడించింది. పట్నా తరఫున అయాన్ 14 పాయింట్లతో సత్తా చాటగా… మరో రెయిడర్ దేవాంక్ కూడా 11 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. జైపూర్‌‌ జట్టులో కెప్టెన్‌, స్టార్ రెయిడర్‌‌ అర్జున్ దేశాల్‌ 20 పాయింట్లతో విజృంభించినా జట్టును గెలిపించలేకపోయాడు.

హోరాహోరీ పోరు..

పోటాపోటీగా సాగిన తొలి అర్ధభాగంలో తొలుత జైపూర్‌‌ పైచేయి సాధించినా.. చివరకు పట్నా ఆధిక్యంలోకి వచ్చింది. రెయిడ్ మిషన్ అర్జున్ దేశ్వాల్  ఆరంభం నుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. బోనస్‌తో తమ జట్టు ఖాతా తెరిచిన అతను వరుస టచ్ పాయింట్లతో చెలరేగాడు. అటువైపు పట్నా ఆటగాళ్లు దేవాంక్‌, అయాన్‌ కూడా విజయవంతమైన రెయిడ్స్‌తో ఆకట్టుకున్నారు. దాంతో తొలి ఐదు నిమిషాలు ఆట హోరీహోరీగా సాగింది.  కానీ, డిఫెండర్లు ఆశించిన మేర రాణించలేకపోవడంతో పట్నా వెనుకబడింది. దీన్ని జైపూర్  సద్వినియోగం చేసుకుంది. కోర్టులో మిగిలిన అయాన్‌ను ఔట్ చేసి ‌ పదో నిమిషంలోనే  పట్నాను ఆలౌట్‌ చేసి 14–10తో ముందంజ వేసింది.

ఆపై అర్జున్  సూపర్ రైడ్‌తో పాటు సూపర్‌‌10 పూర్తి చేసుకున్నాడు. దాంతో జైపూర్ ఆధిక్యం 19–13కి పెరిగింది. ఈ దశలో పట్నా అనూహ్యంగా పుంజుకుంది.  దేవాంక్‌, అయాన్ రెయిండింగ్‌లో జోరు కొనసాగించడగా… డిఫెన్స్‌లోనూ మెరుగైంది. అర్జున్‌ను ట్యాకిల్ చేసి కోర్టు బయటకి పంపించింది.దాంతో 19–19తో స్కోరు సమం చేసింది. ఆవెంటనే కోర్టులో మిగిలిన అభిజీత్‌ను ట్యాకిల్ చేసి జైపూర్‌‌ను ఆలౌట్‌ చేసిన పట్నా 22–20తో ఆధిక్యంలోకి వచ్చింది. అర్జున్‌ను మరోసారి ట్యాకిల్ చేసిన ఆ జట్టు 25–21తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

ఆఖర్లో పట్నా మ్యాజిక్‌..

రెండో అర్ధభాగం మొదలైన వెంటనే జైపూర్ మళ్లీ జోరు పెంచింది. ముఖ్యంగా అర్జున్‌ దేశ్వాల్ చెలరేగిపోయాడు. ఒకే రెయిడ్‌లో  ఏకంగా ఐదుగురు   పట్నా ఆటగాళ్లను ఔట్ చేశాడు. తన మరో రైడ్‌లో కోర్టులో మిగిలిన అక్రమ్‌ షేక్‌ను కూడా టచ్‌ చేసి వచ్చాడు. దాంతో 24వ నిమిషంలో పట్నాను రెండోసారి ఆలౌట్‌ చేసిన పింక్ పాంథర్స్‌ 27–25తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. అయినా పట్నా వెనక్కు తగ్గలేదు. అయాన్‌ రెయిడింగ్‌లో హవా చూపెట్టగా.. డిఫెండర్లు కూడా పట్టుదలగా ఆడారు.

అర్జున్‌ను మరోసారి ట్యాకిల్ చేశాడు. నీరజ్‌ను సూపర్ ట్యాకిల్ చేసి మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 40–40తో స్కోరు సమం చేసింది. ఈ దశలో రెయిడ్ కు వెళ్లిన అర్జున్ ప్రత్యర్థికి దొరికిపోయాడు. కానీ,  పట్నా డిఫెండర్ లైన్ దాటడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. ఆపై, డూ ఆర్ డై రెయిడ్‌లో దేవాంక్ బోనస్ సాధించడంతో పట్నా 42–41తో ఒక పాయింట్ అధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్‌ చివరి రెయిడ్‌ కు వచ్చిన సోంబీర్‌‌ ను ట్యాకిల్ చేసిన పట్నా మూడు రెండు తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

బెంగాల్‌ వారియర్స్ పై దబాంగ్‌ ఢిల్లీ గెలుపు

0

 

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే, నవంబర్ 07: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌) 11వ సీజన్‌ దబాంగ్ ఢిల్లీ కేసీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్‌ను ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 33–30 తేడాతో బెంగాల్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

ఢిల్లీ కెప్టెన్‌, స్టార్ రెయిడర్‌‌ పది పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు. అతనికి తోడు వినయ్‌ 8 పాయింట్లు, ఆశీష్​ ఆరు పాయింట్లతో రాణించారు. బెంగాల్ వారియర్స్‌ జట్టులో రెయిడర్ నితిన్ కుమార్ 15 పాయింట్లతో అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్, డిఫెండర్ ఫజెల్ అత్రాచలి 5 పాయింట్లతో హైఫైవ్ ఖాతాలో వేసుకున్నాడు.

హోరాహోరీలో ఢిల్లీ పైయి

ఆరంభంలో ఆట హోరాహోరీగా సాగినా దబాంగ్ ఢిల్లీ క్రమంగా జోరు పెంచి తొలి అర్ధభాగంలో పైచేయి సాధించింది. మణిందర్‌‌ బోనస్‌తో బెంగాల్ వారియర్స్‌ జట్టు ఖాతా తెరిచాడు. ఆవెంటనే ఢిల్లీ స్టార్ రెయిడర్‌‌ బోనస్‌ సాధించినా ఫజెల్ అత్రాచలి అతడిని ట్యాకిల్ చేశాడు.

తర్వాతి రెయిడ్‌లో విజయ్ కూడా ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కగా.. డూ ఆర్ డై రెయిడ్‌లో నితిన్‌ కుమార్‌‌ అషు మాలిక్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో బెంగాల్ 4–1తో ఆరంభ ఆధిక్యం దక్కించుకుంది. కానీ, ఆశీష్‌ వరుస రెయిడ్లలో విజయవంతం కావడంతో ఢిల్లీ 6–6తో స్కోరు సమం చేసింది. అషు మాలిక్ రెయిండింగ్‌లో జోరు పెంచగా.. డిఫెన్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. మణిందర్‌తో పాటు విశ్వాస్‌ను ట్యాకిల్ చేసి బెంగాల్ ను ఆలౌట్ చేసి 14–8తో ఆధిక్యాంలోకి వెళ్లింది. బెంగాల్ జట్టులో నితిన్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టినా.. ఆధిక్యాన్ని కాపాడుకున్న ఢిల్లీ19-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

ఢిల్లీదే జోరు…

రెండో అర్ధభాగంలోనూ వారియర్స్‌ ఆటగాడు నితిన్‌ జోరు చూపెడూ సూపర్‌‌ 10 పూర్తి చేసుకున్నాడు. దాంతో బెంగాల్ నెమ్మదిగా ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. డిఫెన్స్‌లోనూ కాస్త మెరుగైంది. అటు రెయిడింగ్‌లో నితిన్‌కు తోడు సుశీల్‌ కూడా వెంటవెంటనే రెండు రెయిడ్ పాయింట్లు రాబట్టాడు. డూ ఆర్ డై రెయిడ్‌కు వచ్చిన అంకిత్‌ మానెను అద్భుతంగా ట్యాకిల్‌ చేసిన ఫజెల్‌ అత్రాచలి హై ఫైవ్ పూర్తి చేసుకున్నాడు. దాంతో మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా బెంగాల్27–31తో ఢిల్లీ ఆధిక్యాన్ని నాలుగు పాయింట్లకు పరిమితం చేసింది.

ఈ దశలో అషు మాలిక్ ఎమ్టీ రైయిడ్‌తో సమయం వృథా చేసే ప్రయత్నం చేశాడు. చివర్లో నితిన్‌ మెరుపు వేగంతో రెండు పాయింట్లు తీసుకురావడంతో స్కోరు 29–31తో ఉత్కంఠా మారింది. అయితే, డూ ఆర్‌‌ డై రెయిడ్‌కు వెళ్లిన అషు మాలిక్‌.. మయూర్ కదమ్‌ను డైవింగ్ హ్యాండ్‌ టచ్‌తో ఢిల్లీకి మరో పాయింట్‌ అందించాడు. ఆ వెంటనే నితిన్‌ మరో టచ్‌ పాయింట్‌ తెచ్చినా.. ఆఖరి రెయిడ్‌కు వచ్చిన అషు మాలిక్‌.. ఫజెల్‌ అత్రాచలి పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో ఢిల్లీ మూడు పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది.

తెలుగు టైటాన్స్‌ జోరు తమిళ్‌ తలైవాస్‌పై విజయం

0

*తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం 

అదరగొట్టిన పవన్‌ సెహ్రావత్‌. 

*1000 పాయింట్ల క్లబ్‌లో సచిన్‌. 

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే,నవంబర్‌ 06 : ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 35-34 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

పీకేఎల్‌-8వ సీజన్‌ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్‌ నార్వల్‌(9), విజయ్‌ మాలిక్‌(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్‌ జట్టులో సచిన్‌ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్‌(4), నరేందర్‌(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్‌లో సచిన్‌ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్‌ విజయంతో టైటాన్స్‌ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్‌ 21 పాయింట్లతో మూడులో ఉంది.

ఇరు జట్లు హోరాహోరీగా..

లీగ్‌ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి.

ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్‌ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్‌ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్‌ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్‌ 18వ నిమిషంలో విజయ్‌ మాలిక్‌ రైడ్‌తో టైటాన్స్‌ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్‌ కూడా జతకలువడంతో టైటాన్స్‌ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది.

మ్యాచ్‌ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్‌ ఇద్దరిని పవన్‌ ఔట్‌ చేయడం ద్వారా తలైవాస్‌ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్‌ 11వ నిమిషంలో కిషన్‌, అశిష్‌ను ఔట్‌ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్‌ రైడర్‌ అశిష్‌ నార్వల్‌..అభిషేక్‌ను ఔట్‌ చేసి పాయింట్‌ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్‌ సూపర్‌ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.

పవన్‌, సచిన్‌ దూకుడు: 

ఓవైపు టైటాన్స్‌ తరఫున పవన్‌, మరోవైపు తలైవాస్‌కు సచిన్‌ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్‌ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్‌..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్‌ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్‌ 14వ నిమిషంలో టైటాన్స్‌ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్‌ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్‌ ఔట్‌ కావడంతో తలైవాస్‌ గెలుపు ఆశలపై టైటాన్స్‌ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్‌, సచిన్‌ రైడింగ్‌ జోరు అభిమానులను కట్టిపడేసింది.

యు ముంబా ఉత్కంఠ విజయం

0

యు ముంబా ఉత్కంఠ విజయం

ఆఖరి క్షణాల్లో ఆలౌట్‌తో ఓడిన పట్నా పైరేట్స్ 

హైదరాబాద్‌, న్యూస్ టుడే, నవంబర్‌ 06 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా ఉత్కంఠ విజయం అందుకుంది. ఆధిపత్యం చేతులూ మారుతూ సాగిన పోరులో ఆఖరి క్షణాల్లో పట్నాను ఆలౌట్‌ చేసిన ముంబా పైచేయి సాధించింది. అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజృంభించడంతో బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో యు ముంబా 42–40 తేడాతో పట్నాను ఓడించింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చవాన్‌ తో పాటు మంజీత్ (5 )ఆకట్టుకున్నాడు. పట్నా జట్టులో దేవాంక్ 15 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ముంబాకు ఇది నాలుగో విజయం కాగా.. ఆరు మ్యాచ్‌ల్లో పట్నా మూడోసారి ఓడిపోయింది.

హోరాహోరీలో ముంబా పైచేయి

తొలి అర్ధభాగంలో ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్‌, అయాన్‌ అదరగొట్టగా.. అటు యు ముంబా రెయిడర్ అజిత్ చవాన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని దేవాంక్‌ పట్నా పైరేట్స్ జట్టు ఖాతా తెరవగా.. మంజీత్‌ ముంబాకు తొలి పాయింట్ అందించాడు. దేవాంక్ జోరుతో పట్నా 9–6తో ముందంజ వేసింది. కానీ, డిఫెన్స్‌లో మెరుగైన ముంబా వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో 11–11తో స్కోరు సమం చేసింది. డూ ఆర్ డై రైడ్‌లో సందీప్‌ ఓ పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన సునీల్‌, మంజీత్‌ను అయాన్‌ ఔట్ చేశాడు. దాంతో ముంబైని ఆలౌట్‌ చేసిన పట్నా 16–12తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో అజిత్ తన రెయిడింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా రెండు సూపర్‌‌ రెయిడ్స్‌తో ఐదుగురిని కోర్టు బయటకు పంపించాడు. దాంతో పైరేట్స్‌ను ఆలౌట్‌ చేసి ప్రతీకారం తీర్చుకున్న ముంబా 21–17తో ఆధిక్యంలోకి వచ్చింది. అదే జోరుతో 24–-21తో మూడు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగించింది.

దేవాంక్ దూకుడు.. చివర్లో ముంబా మ్యాజిక్‌

విరామం నుంచి వచ్చిన వెంటనే పట్నా పైరేట్స్‌ జట్టు పుంజుకుంది. అటువైపు అజిత్ రెయిండింగ్ జోరు కొనసాగించినా.. పైరేట్స్ ఆటగాడు దేవాంక్‌ ముంబా డిఫెండర్లను ఏమార్చాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని వస్తూ ఒకే రెయిడ్‌లో మూడు పాయింట్లు రాబట్టాడు. దాంతో పైరేట్స్ 30–28తో మళ్లీ ఆధిక్యం అందుకుంది. పట్నా డిఫెండర్లు కూడా పుంజుకొని ముంబా రెయిడర్లను నిలువరించారు. ఈ క్రమంలో జఫర్దానేష్‌ను ట్యాకిల్‌ చేసిన పట్నా జట్టు ముంబాను రెండోసారి ఆలౌట్‌ చేసి తన ఆధిక్యాన్ని 33–29కి పెంచుకుంది. దేవాంక్ మరో రెండు టచ్ పాయింట్లు రాబట్టడంతో పైరేట్స్ ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అజిత్‌కు తోడు ఆల్‌రౌండర రోహిత్ వెంటవెంటనే రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా 36–37తో ప్రత్యర్థికి చేరువై మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఆపై డూ ఆర్ డై రైడ్‌లో అజిత్ విజయం సాధిచడంతో స్కోరు 37–37తో సమం అయింది. చివరి నిమిషంలో పైరేట్స్ కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలగా.. దీన్ని ముంబా సద్వినియోగం చేసుకుంది. పట్నా ఆటగాడు సందీప్‌ ఓ పాయింట్ తెచ్చి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి క్షణాల్లో అతడిని ట్యాకిల్ చేసిన ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి రెండు పాయింట్లతో ఉత్కంఠ విజయం అందుకుంది.

తమిళ్‌ తలైవాస్‌ను బోల్తా కొట్టించిన బుల్స్ 

0

బెంగళూర్‌ బుల్స్‌ రెండో విక్టరీ..తమిళ్‌ తలైవాస్‌పై 36-32తో ఉత్కంఠ విజయం

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11

హైదరాబాద్‌, న్యూస్ టుడే, నవంబర్‌ 04 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్‌ తలైవాస్‌పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది.

సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ తడబాటుకు గురైంది. సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన తమిళ్‌ తలైవాస్‌కు ఇది రెండో పరాజయం. బెంగళూర్‌ బుల్స్‌ ఆటగాళ్లలో అజింక్య పవార్‌ (6 పాయింట్లు), అక్షిత్‌ (6 పాయింట్లు), సురిందర్‌ దెహల్‌ (5 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్‌ తరఫున నరందర్‌ (6 పాయింట్లు), సచిన్‌ (5) రాణించారు.

బెంగళూర్‌ పైచేయి…

వరుస పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. సోమవారం తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్లు అంచనాలకు మించి రాణించటంతో ప్రథమార్థం ఆటలో తమిళ్‌ తలైవాస్‌పై బెంగళూర్‌ బుల్స్‌ ఓ పాయింట్‌ ఆధిక్యం సాధించింది. రెయిడర్లు అజింక్య పవార్‌, జై భగవాన్‌ కూతలో మెప్పించారు. డిఫెండర్లు సౌరభ్‌ నందల్‌, సురిందర్‌ దెహల్‌ మెరుపు ట్యాకిల్స్‌ చేశారు. తమిళ్ తలైవాస్‌ సైతం రెయిడ్‌లో కాస్త నిరాశపరిచినా.. డిఫెన్స్‌లో మెప్పించింది. ఉత్కంఠగా సాగిన తొలి 20 నిమిషాల ఆటలో బెంగళూర్‌ బుల్స్‌ 14-13తో పైచేయి సాధించింది.

సెకండ్‌హాఫ్‌లో తమిళ్‌ తలైవాస్‌ పుంజుకుంది. డిఫెండర్ల జోరుకు.. రెయిడర్లు సైతం జత కలిశారు. దీంతో తమిళ్‌ తలైవాస్‌ వేగంగానే కోలుకుంది. చివరి పది నిమిషాల ఆటలో ఏకంగా మూడు పాయింట్ల ముందంజలో నిలిచిన తమిళ్‌ తలైవాస్‌.. ఆ తర్వాత నిరాశపరిచింది. 36వ నిమిషంలో 26-26తో స్కోరు సమం చేసింది బెంగళూర్‌ బుల్స్‌. ఆఖరు ఐదు నిమిషాల్లో తలైవాస్‌ను ఆలౌట్‌ చేసి 29-26తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది బుల్స్‌. ఆఖరు వరకు అదే జోరు కొనసాగించిన బెంగళూర్‌ బుల్స్‌ 36-32తో తమిళ్‌ తలైవాస్‌ను బోల్తా కొట్టించింది.

పుణెరి పల్టన్‌ చేతిలో గుజరాత్‌ జెయింట్స్‌ చిత్తు

0

ఎదురులేని పుణెరి పల్టన్‌

గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో ఘన విజయం 

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11

హైదరాబాద్‌, న్యూస్ టుడే, నవంబర్‌ 04 : డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌ టాప్‌ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్‌ ఏకపక్ష విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్‌ 19 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్‌ ఆటగాళ్లలో ఆకాశ్‌ షిండె (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. పంకజ్‌ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్‌ ( 5 పాయింట్లు), ఆమన్‌ ( 5 పాయింట్లు), గౌరవ్‌ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున గుమన్‌ సింగ్‌ ( 13 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్‌ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.

పల్టన్‌ వన్‌సైడ్‌ షో…

వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణెరి పల్టన్‌.. గుజరాత్‌ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్‌ జెయింట్స్‌ను ఆలౌట్‌ చేసిన పుణెరి పల్టన్‌ 30-9తో వన్‌సైడ్‌ షో చేసింది. కెప్టెన్‌ అస్లాం ఇనందార్‌ బరిలో లేకపోయినా.. ఆకాశ్‌ షిండే, పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్‌ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్‌ ఖత్రి, ఆమన్‌ ట్యాకిల్స్‌ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్‌.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ పూర్తిగా తేలిపోయింది. గుమన్‌ సింగ్‌ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.

గుజరాత్‌ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు…

విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్‌ జోరు తగ్గలేదు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్‌ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్‌ జెయింట్స్‌ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్‌ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్‌ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్‌ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ 21 పాయింట్లు దక్కించుకుంది.

హైదరాబాద్ వాటర్ బోర్డు పెండింగ్ బిల్లులపై వడ్డీ మాఫీ

0

వడ్డీ మాఫీ గడువును ఈ నెల నవంబర్ 30 వరకు పొడిగించారు.

హైదరాబాద్, న్యూస్ టుడే, నవంబర్ 04 : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) హైదరాబాద్ వాసులకు వారి నీటి బిల్లులను క్లియర్ చేయడంలో సహాయపడే పథకం గడువును పొడిగించింది.

గతంలో గడువును అక్టోబరు 31 వరకు నిర్ణయించగా, ఇప్పుడు గడువును ఒక నెల పొడిగించి నవంబర్ 30కి పొడిగించారు. వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS-2024) పథకం ద్వారా, కస్టమర్‌లు తమ నీటి బిల్లు బకాయిలను ఎలాంటి వడ్డీని లేకుండానే సెటిల్ చేసుకోవచ్చు.

70వేల కంటే ఎక్కువ మంది వినియోగదారులు హైదరాబాద్ వాటర్ బోర్డ్‌లో బకాయి బిల్లులను క్లియర్ చేశారు. అక్టోబర్‌లో సుమారు 70,300 మంది వినియోగదారులు తమ బకాయిలను క్లియర్ చేయడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు, దీని ద్వారా రూ. 49 కోట్ల ఆదాయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) పొందింది. నెలాఖరు నాటికి వడ్డీ, పెనాల్టీ మొత్తం రూ.17 కోట్లు మాఫీ అయ్యాయి.

పథకం కింద ఇంతకుముందు ఈ ప్రయోజనం పొందని వినియోగదారులకు పూర్తి మినహాయింపు అందుబాటులో ఉంది. బకాయిలు ఉన్నవారికి మిగిలిన వడ్డీపై 50 శాతం మాఫీ ఇప్పటికీ అందుబాటులో ఉంది.

వాటర్ బోర్డ్ అధికారి యొక్క సీనియారిటీపై వడ్డీ మినయింపు ఆధారపడి ఉంటుంది:

నిర్వాహకులు రూ. 2,000 వరకు వడ్డీని మాఫీ చేయవచ్చు.

డిప్యూటీ జనరల్ మేనేజర్లు రూ. 2,001 మరియు రూ. 10,000 మధ్య వడ్డీని మాఫీ చేయవచ్చు.

జనరల్ మేనేజర్లు రూ. 10,001 మరియు రూ. 1,00,000 మధ్య వడ్డీని మాఫీ చేయవచ్చు.

చీఫ్ జనరల్ మేనేజర్లు రూ. 1,00,000 కంటే ఎక్కువ వడ్డీని మాఫీ చేయవచ్చు.

మరిన్ని వివరాల కోసం, HMWS&SB వెబ్‌సైట్‌ను సందర్శించండి. నివాసితులు 155313కు డయల్ చేయడం ద్వారా కస్టమర్ కేర్‌ను కూడా సంప్రదించవచ్చు.

హర్యానా స్టీలర్స్‌ పై బెంగాల్‌ వారియర్స్‌ విజయం

0

*మణిందర్‌ సింగ్‌ సూపర్‌ టెన్‌ జోరు 

*హర్యానా స్టీలర్స్‌పై 40-38తో బెంగాల్‌ వారియర్స్‌ గెలుపు

*ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11 

హైదరాబాద్‌, న్యూస్ టుడే, నవంబర్‌ 03 : బెంగాల్‌ వారియర్స్‌ వరుస టైలకు ముగింపు పలుకుతూ మళ్లీ గెలుపు బాట పట్టింది. చివరి రెండు మ్యాచుల్లో ‘టై’ ఎదురుకాగా ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌పై 40-38తో బెంగాల్‌ వారియర్స్‌ మెరుపు విజయం సాధించింది.

ఆరంభంలో వెనుకంజ వేసినా.. రెయిడర్‌ మణిందర్‌ సింగ్‌ (12 పాయంట్లు) సూపర్‌ టెన్‌ షోతో బెంగాల్‌ వారియర్స్‌ దూకుడు పెంచింది. వారియర్స్‌ తరఫున సుశీల్‌ (4 పాయింట్లు), ప్రవీణ్‌ కుమార్‌ (4 పాయింట్లు), ఫజల్‌ (4 పాయింట్లు) రాణించారు. హర్యానా స్టీలర్స్‌ రెడియర్‌ వినయ్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ రెజా (9 పాయింట్లు), నవీన్‌ (6 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగాల్‌ వారియర్స్‌కు పీకెఎల్‌ 11లో ఇది ఐదు మ్యాచుల్లో రెండో విజయం. హర్యానా స్టీలర్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో రెండో పరాజయం.

ప్రథమార్థం నువ్వా నేనా…

బెంగాల్‌ వారియర్స్‌, హర్యానా స్టీలర్స్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగింది. గత సీజన్‌ రన్నరప్‌ హర్యానా స్టీలర్స్‌ ఆధిక్యంలో నిలిచేందుకు ఎంతో సమయం తీసుకోలేదు. రెయిడర్లకు డిఫెండర్లు సైతం తోడవగా వేగంగా పాయింట్లు సాధించింది. ప్రథమార్థంలో ఎక్కువ భాగం ముందంజలో నిలిచింది. చివర్లో పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌ స్కోరు సమం చేసింది. హర్యానా స్టీలర్స్‌ను ఓ సారి ఆలౌట్‌ చేసింది.

దీంతో 20 నిమిషాల ఆట అనంతరం బెంగాల్‌ వారియర్స్‌, హర్యానా స్టీలర్స్‌ 19-19తో సమవుజ్జీలుగా నిలిచాయి. రెయిడింగ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 10 పాయింట్లు సాధించగా, హర్యానా స్టీలర్స్‌ 12 పాయింట్లు నెగ్గింది. డిఫెన్స్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 4 పాయింట్లు సాధించగా, హర్యానా స్టీలర్స్‌ 5 పాయింట్లు దక్కించుకుంది.

వారియర్స్‌ దూకుడు…

విరామం అనతరం బెంగాల్‌ వారియర్స్ దూకుడు పెంచింది. ప్రథమార్థంలో నెమ్మదిగా పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌.. ద్వితీయార్థంలో రెచ్చిపోయింది. రెయిడర్లు మణిందర్‌ సింగ్‌, సుశీల్‌లు మెరిశారు. డిఫెండర్‌ ఫజల్‌ సైతం కీలక ట్యాకిల్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో సెకండ్‌ హాఫ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ ఆధిక్యంలోనే నిలిచింది.

చివరి ఐదు నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్‌ రేసులోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నం చేసింది. పాయింట్ల అంతరాన్ని 31-33తో కుదించింది. కానీ ఈ సమయంలో మరోసారి స్టీలర్స్‌ను ఆలౌట్‌ చేసిన వారియర్స్‌.. ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. ఆఖరు వరకు పోటీనిచ్చిన హర్యానా స్టీలర్స్‌ 37-39తో వారియర్స్‌ను వెంబడించింది. చివరి కూతలో వారియర్స్‌ రెయిడర్‌ అవుటైనా.. 40-38తో పైచేయి నిలుపుకుంది.

అద‌ర‌గొట్టిన తెలుగు టైటాన్స్‌

0

*అద‌ర‌గొట్టిన తెలుగు టైటాన్స్‌ 

బెంగళూర్‌ బుల్స్‌పై 38-35తో విజయం.

*ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11.

హైదరాబాద్‌,న్యూస్ టుడే, నవంబర్‌ 02: తెలుగు టైటాన్స్‌ పంజా విసిరింది. బెంగళూర్‌ బుల్స్‌ను బోల్తా కొట్టించి సీజన్‌లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌పై గెలుపొందింది.

 

తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్లు పవన్‌ సెహ్రావత్‌ (14 పాయింట్లు), ఆశీష్‌ నర్వాల్‌ (6 పాయింట్లు), అజిత్‌ పవార్‌ (5 పాయింట్లు), విజయ్‌ మాలిక్‌ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్‌ బుల్స్‌ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్‌ (9 పాయింట్లు), నితిన్‌ రావల్‌ (7 పాయింట్లు), రెయిడర్‌ అజింక్య పవార్‌ (9 పాయింట్లు), డిఫెండర్‌ అరుల్‌ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్‌ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్‌ పవర్‌ సెహ్రావత్‌ సీజన్లో అత్యధిక రెయిడ్‌ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

 

తెలుగు టైటాన్స్‌ పంజా… 

ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌ అదరగొట్టింది. బెంగళూర్‌ బుల్స్‌పై ధనాధన్‌ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్‌ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్‌ సెహ్రావత్‌, ఆశీష్‌ నర్వాల్‌లు కూతకెళ్లి బుల్స్‌ను ఆలౌట్‌ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్‌ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్‌ బుల్స్‌ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్‌ ట్యాకిల్స్‌తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్‌ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.

 

బుల్స్‌ మెరుపు వేగంతో…

విరామం అనంతరం బెంగళూర్‌ బుల్స్‌ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్‌ ఆలౌట్‌ చేసింది. మెరుపు ట్యాకిల్స్‌కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్‌ బుల్స్‌. స్టార్‌ రెయిడర్‌ పవర్‌ సెహ్రావత్‌ విఫలమైతే.. టైటాన్స్‌ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్‌కు పోటీ ఇచ్చిన బెంగళూర్‌ బుల్స్‌ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది.