మాదాపూర్,ది న్యూస్ టుడే,నవంబర్ 30 : వినసొంపైన సంగీతానికి అనుగుణంగా కనువిందు చేసే నృత్య ప్రదర్శనలతో ‘శంభు కింకిణి’ నృత్యోత్సవం ఆధ్యాంతం ఆకట్టుకుంది. మాదాపూర్ లోని శిల్పారామంలో శనివారం పద్మకల్యాణ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శంభు కింకిణి నృత్యోత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వహకులు తెలిపారు. మొదటి రోజున ఆరుణ స్వరూప్ మండోదరి శబ్దం, ఎంతచక్కని వాడే, జావళిలను కూచిపూడి నృత్య రూపకంలో ప్రదర్శించి ఆకట్టుకోగా, డెబీజాని బసు శివస్తుతి, తీవ్రాల్, తుమ్రి, తులసి దాస్భజన్లను కథక్ నృత్య, రూపకంలో నర్తించి అలరించింది. శోభన మిత్ర దాస్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఉమెన్ ఉడ్ను మణిపురి నృత్యరీతిల, సాయి మనస్విని ఆంధ్రనాట్యం ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నృత్యోత్సవాలను తెలుగు యూనివర్సిటీ