హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్2 : నిత్యం ఏదో వివాదాల్లో శ్రీ చైతన్య కాలేజీ లు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తుంది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మదినగూడలో విద్యార్థులను వేధించిన వైస్ ప్రిన్సిపల్ శివ. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోటోలు తీసి బెదిరించడం మార్కులు తగ్గిస్తానని పలు రకాలుగా ఇబ్బంది పెట్టేవాడని స్టూడెంట్స్ ఆరోపించారు.
అవసరం లేకపోయినా 7గం వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ..మీ మోకాలకు ఐపీ ఎగ్జామ్స్ ఎక్కువ మెయిన్స్ అవసరమా అని తిట్టేవారు అంతేకాకుండా మంత్లీ 95% అటెండెన్స్ ఉండాలని లేకపోతే మర్క్స్ కట్ చేస్తామని పదే పదే బెదిరిస్తారని విద్యార్థినిలు వాపోయారు. మంత్ టైమ్ లొ ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. స్నాప్ చాట్ లొ ఇబ్బందికరంగా చాట్ చేస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజ్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకున్నారు.