తప్ప తాగి 12 ఏండ్ల కన్న కూతురిపై లైంగికదాడి

హైదరాబాద్, జులై 19: ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి(36) సిటీకి వచ్చి మేడిపల్లి, సాయినగర్ కాలనీలో ఉంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడిని భార్య వదిలిపెట్టిపోవడంతో తల్లితో ఉంటున్నాడు. కూతురు(12)ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు.

కొన్ని రోజుల కిందట కూతురుకు జ్వరం రావడంతో ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో అర్ధరాత్రి మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడిక పాల్పడ్డాడు. బాలికకు జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.

విద్యుత్ కోతలు భరించలేక.. సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

మహబూబ్ నగర్, జులై 18 : జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండలంలోని జాకినాల పల్లి సబ్ స్టేషన్ ముందు ఉర్కొండ పేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు.

గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడిఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

https://x.com/teluguscribe/status/1813858433474441684?s=46

రీల్స్ చేస్తూ లోయలో పడి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి

0

ముంబయి, జులై 18 : ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని బయటకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అన్వీ మరణించింది. కాగా అన్వీకి సోషల్ మీడియాలో సుమారు 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.7,000 కోట్లు జమ

హైదరాబాద్, జులై 18 : ఆగస్టు నాటికి మూడు దశల్లో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.లక్ష రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు రూ. గురువారం సాయంత్రం 4 గంటలకు హార్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తామని, ఈ నెలాఖరులోగా రూ.1.5 లక్షల రైతుల రుణాలు మాఫీ చేస్తామని, ఆగస్టు నాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

పంట రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం లేదు అని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం ద్వారా రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. పంట రుణాల మాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కార్యక్రమాలను క్యాడర్లు నిర్వహించాలి అని తెలిపారు.

దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి రూ.31 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయలేదని, తెలంగాణలో పంట రుణమాఫీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ఎంపీలు నిలదీయాలని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఐదు హామీలను అమలు చేసిందని, అయితే ఆ పథకాలపై క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రైతులకు చేరవేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటకు కట్టుబడి రుణమాఫీని అమలు చేస్తోందని వారికి తెలియజేయాలని కాంగ్రెస్‌ నాయకులను సీఎం కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది

హైదరాబాద్, జూన్ 15 : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. సంఖ్య 567, పంట రుణాల మాఫీ అమలు కోసం మార్గదర్శకాలను జాబితా చేస్తుంది. GO ప్రకారం, మాఫీ ఒక రైతు కుటుంబానికి రూ.2 లక్షలకు పరిమితం చేయబడుతుంది. పౌరసరఫరాల శాఖకు చెందిన ఆహార భద్రత కార్డు డేటాబేస్ రైతు కుటుంబాన్ని నిర్వచించడానికి పారామీటర్‌గా పరిగణించబడుతుంది. డిసెంబర్ 12, 2018 మరియు డిసెంబర్ 9, 2023 మధ్య పొందిన స్వల్పకాలిక పంట రుణాలకు ఇది వర్తిస్తుంది.

షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరియు జిల్లా సహకార బ్యాంకుల నుండి పొందిన రుణాలకు మాఫీ అమలు చేయబడుతుంది. రైతులు అదనపు రుణ మొత్తాన్ని (రూ. 2 లక్షల కంటే ఎక్కువ) బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు మొత్తం చెల్లించిన తర్వాత, మిగిలిన రూ.2 లక్షలు రైతు రుణ ఖాతాలో జమ చేయబడతాయి.

వ్యవసాయ కమీషనర్ వ్యవసాయ రుణమాఫీ 2024కి అమలు చేసే అధికారిగా ఉంటారు మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అమలుకు IT భాగస్వామిగా ఉంటుంది.వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమం అమలు కోసం ఒక ప్రత్యేక పోర్టల్ నిర్వహించబడుతుంది. ప్రతి రైతు రుణ ఖాతా, డేటా ధ్రువీకరణ, అర్హత మరియు ఇతర వివరాలన్నీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచబడతాయి.

రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ గ్రీవెన్స్ సెల్‌లను ఏర్పాటు చేస్తుంది. వారు పోర్టల్‌లో లేదా మండల స్థాయిలోని కేంద్రాలలో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. అధికారులు దరఖాస్తును పరిశీలించి 30 రోజుల్లోగా పరిష్కరించి రైతులకు తెలియజేయాలి. ప్రతి బ్యాంకు నోడల్ అధికారిని నియమిస్తుంది మరియు అధికారి వ్యవసాయ శాఖ మరియు ఎన్‌ఐసితో సమన్వయం చేసుకుంటారు. సంబంధిత బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలపై అధికారి డిజిటల్‌ సంతకం చేయాల్సి ఉంటుంది.

ఎస్‌హెచ్‌జిలు, జెఎల్‌జిలు, ఆర్‌ఎమ్‌జిలు, ఎల్‌ఇసిఎస్ ద్వారా సెక్యూర్ చేయబడిన రుణాలకు వ్యవసాయ రుణ మాఫీ వర్తించదు. అదే విధంగా రీషెడ్యూల్ చేసిన రుణాలు లేదా సంస్థలు లేదా కంపెనీల ద్వారా సెక్యూర్ చేయబడిన పునర్వ్యవస్థీకరణ రుణాలకు ఇది వర్తించదు కానీ PACS ద్వారా సెక్యూర్ చేయబడిన రుణాలకు ఇది వర్తిస్తుంది.

సరికొత్త ‘నువ’ డైమండ్స్ ను ప్రారంభించిన మలబార్ 

0

హైదరాబాద్, జూన్ 28 : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరికొత్తగా నువ డైమండ్ కలెక్షన్ ప్రారంభించిన. ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద జ్యువలరీ రిటైలర్ గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ డైమండ్ సంస్థ. “నువ” పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల సేకరణను ఆవిష్కరించారు. చందానగర్ మలబార్ షో రూమ్ లో ఈ సరికొత్త కలెక్షన్ ను జూన్ 28వ తేదీ నుండి కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మలబార్ మేనేజ్మెంట్ టీం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.

ప్రకృతి ప్రసాదించిన సంక్లిష్టమైన ఆకృతులు అలల వివిధ రూపాల మడతలు, అల్లికల నుండి సేకరణ పొంది విలాసవంతమైన వజ్రభరణాలుగా రూపొందించబడిన ఒక వేడుక సేకరణ. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షించబడి ధ్రువీకరించబడినది 100 శాతం మార్పిడి విలువతో 100 శాతం పారదర్శకత్వం గ్యారెంటీతో 20% డిస్కౌంట్ గల మలబార్ వాగ్దానాల హామీతో లభిస్తుందని ఈ సందర్భంగా చందానగర్ నిర్వాహకులు దీపక్ తెలియజేశారు.

ఓవైసికి అంత ప్రేముంటే పాలస్తినా కు వెళ్ళాలి

0

న్యూఢిల్లీ, జూన్ 26 : ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జూన్ 25, మంగళవారం హైదరాబాద్ శాసనసభ్యుడు 18వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుని (ఎంపీ) గా ప్రమాణ స్వీకారం సందర్భంగా “జై పాలస్తినా” అని నినాదాలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది.

ఈ నినాదం ట్రెజరీ బెంచీల నుండి తీవ్ర విమర్శలతో సభలో గందరగోళానికి దారితీసింది. ఒవైసీ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేయడంపై బిజెపి సభ్యులు గందరగోళం సృష్టించారు. వెంటనే సభా కార్యకలాపాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తప్ప, అదనంగా ఏమీ నమోదు కాబోదని ఆ సమయంలో చైర్‌లో ఉన్న రాధామోహన్ సింగ్ సభ్యులకు హామీ ఇచ్చారు.

ఒవైసీ భారతదేశంలో నివసిస్తూ లోక్‌సభ వంటి పవిత్ర ప్రదేశంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని చేయడం సిగ్గుచేటు అని, అసదుద్దీన్ ఒవైసీకి పాలస్తీనాపై అంత ప్రేమ ఉంటే అక్కడికి వెళ్లాలి. మీరు నిజమైన ముస్లిం అయితే, దమ్ము ఉంటే, మీరు పాలస్తీనాకు వెళ్లాలి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా ఒవైసీ నినాదానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒకవైపు రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేస్తూనే మరోవైపు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒవైసీ అసలు ముఖం బయటపడింది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

https://x.com/ANI/status/1805544613299864058?t=V62xcbIl8mFN9VNiRMimTA&s=19

సమాజానికి యువత ఆదర్శం అవ్వాలి – జగదీశ్వర్ గౌడ్

హైదరాబాద్, (శేరిలింగంపల్లి), జూన్ 25 : యువత మంచి మార్గాన్ని ఎంచుకుని సమాజా నిర్మాణం తో పాటు సేవలో మొదటి మెట్టుగా నిలవాలనే శ్రీ కృష్ణ యూత్ ఆశయం అని వ్యవస్థాపకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

తన పుట్టిన రోజును పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి రోడ్డు నెంబర్ ఒకటిలో ఎన్నో ఏళ్ళుగా పూరి గుడిసెలో నివాసమయంటున్న నిరుపేద కుటుంబానికి శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శ్రీ.అభిషేక్ గౌడ్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చు 3లక్షల రూపాయలతో రెండు గదుల రేకుల ఇల్లుని నిర్మించి ఇంటిని శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ వారికి బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

శ్రీ కృష్ణ యూత్ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి మరియు ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి తన భుజాలపై వేసుకొని ఒక నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి వారి జీవితంలో ఒక కలను సాకారం కావడానికి తోడ్పడిని శ్రీ కృష్ణ అధ్యక్షులు,సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.రాజు, కె.కుమార్, కె.భిక్షపతి, జి.యాదగిరి, మెహమ్ముద, అబ్దుల్ సత్తార్, ఫారీద్, సయ్యద్ పాషా, రాఘవ చారి, లడ్డు, రాములు, అనిల్, టి.జయరాం, గణేష్, మహేష్, హరీష్, శ్రవణ్ చారి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులను సన్మానించిన శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు 

హైదరాబాద్, (శేరిలింగంపల్లి), జూన్ 25 : ఇటీవల కేంద్ర మంత్రులుగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి (కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ), కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ (కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి) అదేవిదంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డి.కే అరుణ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం.రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ ఢిల్లీలోని వారి నివాసంలో ప్రత్యక్షంగా కలిసి శాలువతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మాట్లాడుతూ..ఢిల్లీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులను కలువడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గం అభివృద్ధికి తమ వంతు కృషి ఉంటుందని తెలిపారని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిలో కూడ బిజెపి మరింత బలపడడానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మాదాపూర్ కంటేస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి కంటేస్టెడ్ కార్పొరేటర్ ఏల్లెష్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి 

శేరిలింగంపల్లి, జూన్ 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ని మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్కని నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఆరోగ్యకరమైన జీవితంతో.. నీ ప్రతి అడుగు ప్రజలకు మంచి జరిగేలా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జగదీశ్వర్ గౌడ్ కి సూచించారు.