సగరులు రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందిస్తా – డీకే అరుణ

0

*సగరులు రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందిస్తా – డీకే అరుణ

*విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం లో హాజరైన ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 15 : సగరులు రాజకీయంగా ఎదిగేందుకు తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ హామీ ఇచ్చారు. ఏ వర్గాలైన ఉన్నత స్థాయిలో నిలవాలంటే ఉన్నత చదువులే కారణం అవుతాయని అభిప్రాయపడ్డారు. సగర సేవా సమితి, మహబూబ్ నగర్ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్ నగర్   ఏనుగొండ సగర భవనంలో నిర్వహించిన సగర విద్యార్థుల కు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సమాజంలో వేలునుకొని ఉన్న రుగ్మతల తొలగింపుకు ఉన్నత చదువులే కారణమవుతాయని ఆమె అన్నారు. భవిష్యత్తు తరాలు ఆశించిన స్థాయిలో మారాలంటే అక్షర జ్ఞానంతోనే మొదలు పెట్టాలని ఆమె సూచించారు. సగరుల అభ్యున్నతి కోసం కుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె అన్నారు. సగరులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో సగరుల రాజకీయ ఎదుగుదలకు తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సగరులు పోటీ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.

గౌరవ అతిథిగా హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సగరులు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నారని, ప్రభుత్వపరంగా సగరులకు కావాల్సిన సహకారాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను మరింత ప్రదర్శించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.

తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రిజర్వేషన్ల పై ఆధారపడకుండా ప్రతిభా పాటవాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగరుల హక్కుల సాధన కోసం రాష్ట్ర సగర సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో సగరులు బి సి డి లో నుంచి ఏలోకి మారెందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే రాష్ట్రస్థాయిలో సగర విద్యార్థుల కు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు ఉన్నతి కోసం సగరులు మరింత ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సగర సేవా సమితి అధ్యక్షులు పర్వతాలు సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సగర సంఘం చీఫ్ అడ్వైజర్ ఆర్.బి ఆంజనేయులు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డన్న సగర, జిల్లా అధ్యక్షులు సాయి ప్రనిల్ చందర్ సగర, మాజీ రాష్ట్ర అధ్యక్షులు బంగారు నరసింహ సగర, రిటైర్డ్ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ నగర్, సగర సేవా సమితి ప్రధాన కార్యదర్శి నారాయణ సగర, కోశాధికారి గోపాల్ సగర, ప్రేమ్ సాగర్, ఉదయ్ సాగర్, అడ్వకేట్ హనుమంతు సాగర్, మూసాపేట్ మాజీ జెడ్పిటిసి ఇంద్రయ్య సగర, బిజెపి సీనియర్ నాయకులు దేవన్న సగర, సగర యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సవారీ సత్యం సగర, బిసి సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస సాగర్, చుక్కల చంద్ర శేఖర్ సాగర్, చంద్ర మోహన్ సాగర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సాగర్, సుధాకర్ సగర తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

0

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : గణేష్ నిమర్జనం మరియు మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పలు పాఠశాలలు రెండు రోజుల సెప్టెంబరు 16, సోమవారం మరియు సెప్టెంబర్ 17 మంగళవారం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు లాంగ్ వీకెండ్ అందుబాటులో ఉంది.

సెప్టెంబరు 17న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. హైదరాబాద్‌తోపాటు సికింద్రాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని గణేష్‌ నిమజ్జనం పురస్కరించుకుని ఈ ఉత్తర్వు వర్తిస్తుంది.

సెప్టెంబర్ 19న హైదరాబాద్‌లో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ, పాఠశాలలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వ అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం, మిలాద్ ఉన్ నబీ కారణంగా అన్ని విద్యా సంస్థలు సెప్టెంబర్ 16 న మూసివేయబడతాయి. రెండు పండుగల జన సంద్రం ఎక్కువగా ఉండంతో, హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే మిలాద్-ఉన్-నబీ వేడుక మరియు ఊరేగింపును ఈ ఏడాది సెప్టెంబర్ 19కి వాయిదా వేయాలని ముస్లిం సమాజం నిర్ణయించింది.

కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కేటిఆర్ శనివారం కౌశిక్ రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్బంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 10 మంది ఎమ్మెల్యేలు నైతిక ప్రాతిపదికన అలా చేస్తున్నారని అన్నారు. కొన్ని రోజుల ముందు వారు భారత రాష్ట్ర సమితితో ఉన్నారని పేర్కొన్నారు. మా ఎమ్మెల్యే (కౌశిక్ రెడ్డి) ఇలాంటి ప్రవర్తనను ప్రశ్నిస్తే, కాంగ్రెస్ అతని నివాసానికి పోలీసులను పంపింది.

పోలీసులు కౌశిక్‌రెడ్డి కుటుంబ సభ్యులను కూడా దెబ్బతీశారని, వారి గదులను ఆక్రమించారని కేటీఆర్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రా లేదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) బాధ్యత తీసుకుంటారా..?

గత దశాబ్దంలో ప్రతిపక్షాలపై ఇంత హింస జరగలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ మరియు ఇతరులపై సెప్టెంబర్ 13, శుక్రవారం బీఆర్ ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధత ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఎకరాకు రూ.10వేలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఖరీఫ్ రైతుల భవితవ్యంపై జరుగుతున్న చర్చను ఎత్తిచూపిన కేటీఆర్.. రైతుకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో రైతులకు భరోసా, ఎకరానికి రైతు బంధు/భరోసాగా రూ. 15,000 ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ జోకర్ ఎవరు..? ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు అని కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్ లో పేర్కొన్నారు.

ఖరీఫ్ రైతులు మరోసారి తమ రుణ అవసరాలను తీర్చుకునేందుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సాయం అందక రైతులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ లేకపోవడం, పూర్తికాని రైతు భరోసా పథకం రైతుల కష్టాలను మరింత పెంచాయి.

https://x.com/KTRBRS/status/1834803129323323661?t=XpADXj00Bgg0MvdwOIsyfA&s=19

 

గణేష్ నిమజ్జనం ఊరేగింపుల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 14 : తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 17న సెలవు ప్రకటించింది. నగరంలో గణేష్ నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

అదేవిదంగా మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెప్టెంబర్ 16న అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అయితే హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ఈ ఏడాది సెప్టెంబర్ 19కి వాయిదా పడింది.

సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు. మతపరమైన ఉద్రేకంతో పాటు, పండుగ సందర్భంగా ఊహించిన ట్రాఫిక్ రద్దీ కారణంగా హైదరాబాద్‌లోని పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించారు.

సెప్టెంబర్ 10, మంగళవారం మరియు సెప్టెంబర్ 16 సోమవారం మధ్య నెక్లెస్ రోడ్ (పివిఎన్ మార్గ్) సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం మరియు సంబంధిత ఊరేగింపుల దృష్ట్యా సిటీ ట్రాఫిక్ పోలీసులు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు.

వారంలో ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వర్తిస్తాయి.

 

 

ఘనంగా గురు పూజా మహోత్సవము

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 04 : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శేరిలింగంపల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు సరస్వతీమాత చిత్రపటాలకు జ్యోతి ప్రదీపనము చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య Y. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠము, తెలుగు విశ్వవిద్యాలయం విచ్చేసి శేరిలింగంపల్లి మండల పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, జవహర్ నవోదయ, గురుకుల బాలుర మరియు బాలికల కళాశాలలు, రాయదుర్గ్, కొత్తగూడ, శేరిలింగంపల్లి, మియాపూర్ జిల్లా పరిషత్తు హైస్కూల్స్ కాంప్లెక్స్ ల  పరిధిలో గల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులలో 35 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సాంప్రదాయ పద్ధతిలో (సన్నాయి మేళాల నడుమ వేద పండితుల ఆశీర్వచనము, శాలువా, జ్ఞాపిక, పగడి, పుష్పగుచ్ఛము మరియు తాంబూలంతో) ఘనంగా సత్కరించటం జరిగింది.

ఈ కార్యక్రమం తూనిక రాఘవేంద్రరావు (సామాజికవేత్త మరియు బిల్డర్) సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్యామల మాట్లాడుతూ ఈ సమాజంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా గౌరవింపబడే వృత్తి అధ్యాపక వృత్తి అని అన్నారు. వేద కాలం నుండి మాతా పితరుల తరువాత గురువుకు పెద్ద పీఠం వేసింది ఈ సమాజం. విద్యార్థులను అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వాడే గురువు. గురువు తను ఆర్జించిన విజ్ఞానాన్ని అంతా కూడా శిష్యులకు ధారపోసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వాడు గురువు. సృష్టి, స్థితి, లయల నిర్దేశకుడే గురువు. అందుకనే గురు పూజా మహోత్సవము జరుపుకుంటున్నాము. మనదేశంలో సెప్టెంబర్ 5వ తేదీన ఈ గురుపూజా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  అసాధారణ ప్రజ్ఞాశాలి, రాజనీతి కోవిదుడు, విద్యావేత్త, ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలోనూ, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన చొరవ అయనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఆయన విశ్వవిఖ్యాత తాత్వికవేత్త. ఆయన అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, ఉప కులపతిగా, యునెస్కో అధ్యక్షుడిగా, విదేశీ రాయబారిగా, స్వతంత్ర భారత ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సమాజానికి, దేశానికి విశేషమైన సేవలు అందించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పాఠాలను బోధించారు. ఆయనను కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ లాంటి అనేక విదేశీ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతోటి సత్కరించడం జరిగింది. ఆయన భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన తరగతి గదులలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పారు.

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని సెలవిచ్చారు. ఉపాధ్యాయులే భవిష్యత్ సమాజ నిర్దేశకులు అని పేర్కొన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తికి గుర్తింపు మరియు గౌరవాన్ని  కలిగించారు. ఆయన గొప్ప తాత్విక రచయిత. తత్వశాస్త్రంపై అనేక రచనలు చేశారు. ఆయన మన అందరికి ఆదర్శప్రాయుడు. ఆయన గౌరవార్ధం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తారీఖును ఉపాధ్యాయ దినోత్సవంగా 1962 నుండి నిర్వహించుకుంటున్నాము అని తెలిపారు.

నేటి యువ ఉపాధ్యాయులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని క్షేత్ర స్థాయిలో వస్తున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ నూతన విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింప చేసుకొని భావిభారత పౌరులైన విద్యార్థిని విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయవలసిన సామాజిక బాధ్యత అధియాపకులదే అని అన్నారు. అధ్యాపక వృత్తికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని అధ్యాపకుల జీవనశైలి మిగతావారికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా నడుచుకోవాలి అని కోరారు. విద్యార్థులు గురువులు చెప్పిన విధంగా నడుచుకొని, ఎల్లవేళలా గురువులను గౌరవించాలి. వారి తల్లిదండ్రులు కూడా గురువులను గౌరవిస్తూ సహకరించాలి అని కోరారు.

ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్న ప్రభగారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో T.రాఘవేంద్రరావు వివిధ పాఠశాలల, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు V. ఫణికుమార్, అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, నేమానివిశ్వశాంతి, G.వెంకటధర్మసాగర్ , విజయలక్ష్మి, త్రివేణి, మమతా , సత్యవాణి, వరలక్ష్మి, G.V.రావు, బాలన్న, M.S.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

0

హైదరాబాద్,సెప్టెంబర్ 04 : ఈ నెలలోనే మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

మిలాద్-ఉన్-నబీ రబీ అల్ అవ్వల్ 12న జరుపుకుంటారు, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7న వస్తుంది.

తెలంగాణలో మిలాద్-ఉన్-నబీ, గణేష్ చతుర్థికి సెలవులు
తెలంగాణ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 7, 16 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థికి సెలవు, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవు. అయితే, రాష్ట్ర క్యాలెండర్‌లో ఈద్-ఇ-మిలాద్ సెలవుదినం పేర్కొనబడినప్పటికీ, చంద్రుని దర్శనాన్ని బట్టి ఇది మారవచ్చు. ఈ రోజు నెలవంక దర్శనమిస్తే, సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీ జరుపుకుంటారు; లేకపోతే, అది సెప్టెంబర్ 17 న వస్తుంది.

మరోవైపు తెలంగాణలో గణేష్ చతుర్థికి సెప్టెంబర్ 7న సెలవు కాగా, సెప్టెంబరు 17న గణేష్ విసర్జనను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏటా హైదరాబాద్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు నిర్వహిస్తారు. వాయిదా వేయబడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19న నిర్వహించనున్నారు.
పండుగలకు సిద్ధం కావాలని హైదరాబాద్ సీపీ అధికారులను కోరారు
రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అధికారులను సన్నద్ధం చేయాలని కోరారు.

సమయపాలన, నిజాయితీ, పని తీరు, పిటిషనర్లకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల పట్ల సానుభూతి, సానుభూతి చూపడం, పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని పోలీసు శాఖలోని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ‘హరిత’ రిసార్టులు, హోటళ్లు

0

హైదరాబాద్, జులై 23 : హరిత రిసార్ట్స్, హోటల్స్ ల నుండి ప్రభుత్వనికి కోట్లాది రూపాయల తెచ్చిపెడుతూ లాభాల్లో ఉన్నా సరే తప్పుకుంటున్న తెలంగాణ పర్యాటక సంస్థ.

వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యంగా ఉండే పర్యాటక రిసార్టులు, హోటళ్లు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయి.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు సమీపంలో ఉన్న హరిత రిసార్ట్, హోటల్ తో ప్రభుత్వానికి సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం రాగా, గత నెలలో ఈ రిసార్ట్ ను ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది.

ఇదే బాటలో నెలకి కోటిన్నర ఆదాయం ఇచ్చే గోల్కొండలోని తారామతి – బారాదరిని అలాగే ఏడాదికి మూడున్నర కోట్లకు పైగా ఆదాయం వచ్చే వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ సమీపంలోని హరిత రిసార్టులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.

ఏటా రెండున్నర కోట్లు ఇచ్చే నిజామాబాద్ జిల్లాలోని రిసార్ట్ ను కొందరు రాజకీయ నాయకులు పొందడానికి ప్రయత్నిస్తుండగా..బేగంపేటలోని టూరిజం ప్లాజాను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

0

*గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి.

భద్రాచలం,జులై 22 : భద్రాచలంవద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురు స్తున్న భారీ వర్షాల కారణంగా గంటగంటకు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణ హిత, ఇంద్రావతి, తాలి పేరు, కిన్నెరసాని, శబరి, కడెం ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీరంతా గోదావరిలో చేరుతుండటంతో వరద ఉధృతి అంత కంతకూ పెరుగుతోంది.

ఆదివారం సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల వద్దకు చేరుకోగా సోమవారం ఉదయం 7గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 46.4 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఆదివారం రాత్రి 11గంటలకు గోదావరి నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది.

సోమవారం ఉదయం 46.4 అడుగులకు నీటిమట్టం చేరింది. 10,68,602 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకే చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే అలర్ట్ గా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 50అడుగులు దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ మేరకు భద్రాచలం వద్ద గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

జాతీయ రహదారి ప్రయాణం పై పెట్రోల్, డీజిల్ ఉచితం ఎలా..?

0

హైదరాబాద్, జులై 21 : జాతీయ రహదారిపై ప్రయాణంలో పొందిన టోల్ రసీదును అర్థం చేసుకుని, దానిని ఉపయోగించండి. టోల్ బూత్ వద్ద ఇచ్చిన ఈ రసీదులో ఏమి ఉంది మరియు దానిని ఎందుకు భద్రంగా ఉంచాలి.

 *అదనపు ప్రయోజనాలు ఏమిటి..?

1. టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు మీ కారు అకస్మాత్తుగా ఆగిపోతే, మీ కారును లాగడం మరియు తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత.

2. ఎక్స్‌ప్రెస్ హైవేలో మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే, మీ కారు పెట్రోల్, డీజిల్ భర్తీ చేయడం మరియు బ్యాటరీ ఛార్జింగ్‌ని అందించడం టోల్ వసూలు చేసే సంస్థ బాధ్యత. మీరు 1033 నెంబరుకు కాల్ చేసిన పది నిమిషాలలో సహాయం చేస్తారు, మరియు 5 నుండి 10 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందుతారు. కారు పంక్చర్ అయినప్పటికీ, మీరు సహాయం కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చు.

3. మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరు ముందుగా టోల్ రసీదు మీద ఇచ్చిన ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి.

4. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అటువంటి సమయంలో మీకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయడం టోల్ కంపెనీల బాధ్యత.

ప్రమాదవాశాత్తు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి 

*గడ్డం కింద గన్ పెట్టుకొగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి.

హైదరాబాద్, జులై 21: హైదరాబాదులోని శంకర్ పల్లి వద్ద సిఐఎస్ఎఫ్ బెటాలియన్ బ్యాచ్ తో కలిసి విది నిర్వహణలో భాగంగా బస్సులో ప్రయాణం చేస్తుండగా గన్ గడ్డం కింద పెట్టుకొగా ప్రమాదవశాత్తు గన్ పేలగా గడ్డం క్రింద నుండి బుల్లెట్లు తల పై భాగం లోకి దూసుకెళ్లిన బుల్లెట్లు.

బస్సులో పెద్ద శబ్దం రావడంతో తోటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ లు మొత్తం ఉలిక్కిపడ్డారు. ఏమీ జరిగిందో అని తెలుసుకునేలోపే రక్తపు మడుగులో కుప్పకూలిన సిఐఎస్ఎఫ్ వెంకటేశ్వర్లు. మృతుడు వెంకటేశ్వర్లు మృతి ప్రమాదవశాత్త లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.