న్యూఢిల్లీ, జూన్ 26 : ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జూన్ 25, మంగళవారం హైదరాబాద్ శాసనసభ్యుడు 18వ లోక్సభలో పార్లమెంటు సభ్యుని (ఎంపీ) గా ప్రమాణ స్వీకారం సందర్భంగా “జై పాలస్తినా” అని నినాదాలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది.
ఈ నినాదం ట్రెజరీ బెంచీల నుండి తీవ్ర విమర్శలతో సభలో గందరగోళానికి దారితీసింది. ఒవైసీ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేయడంపై బిజెపి సభ్యులు గందరగోళం సృష్టించారు. వెంటనే సభా కార్యకలాపాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తప్ప, అదనంగా ఏమీ నమోదు కాబోదని ఆ సమయంలో చైర్లో ఉన్న రాధామోహన్ సింగ్ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఒవైసీ భారతదేశంలో నివసిస్తూ లోక్సభ వంటి పవిత్ర ప్రదేశంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని చేయడం సిగ్గుచేటు అని, అసదుద్దీన్ ఒవైసీకి పాలస్తీనాపై అంత ప్రేమ ఉంటే అక్కడికి వెళ్లాలి. మీరు నిజమైన ముస్లిం అయితే, దమ్ము ఉంటే, మీరు పాలస్తీనాకు వెళ్లాలి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా ఒవైసీ నినాదానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒకవైపు రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేస్తూనే మరోవైపు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒవైసీ అసలు ముఖం బయటపడింది అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
https://x.com/ANI/status/1805544613299864058?t=V62xcbIl8mFN9VNiRMimTA&s=19