గోపనపల్లి పెద్ద చెరువును సందర్శించిన డీసీ రజినీకాంత్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, (గచ్చిబౌలి ), జూన్ 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో గల పెద్ద చెరువులోకి చేరిన కాలుష్యం కారణంగా చేపలు చనిపోయినా విషయం, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు నేరుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ద్వారా చెరువులోకి విడిచారని, దీంతో చేపలు మృతి చెందాయని పేర్కొన్నారు.

కలుషిత నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి స్పందిస్తూ..గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ద్వారా చెరువులోకి వచ్చే మురుగు నీటి నిర్మూలనకు శాశ్వత పరిష్కారినికి ఇక పై తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, శేఖర్, రంగస్వామి, రంగస్వామి, మహేష్, నగేష్, విక్రమ్, టింకు, గోవర్థన్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

మహిళా ప్రయాణికులకు ఇప్పటివరకు 54 కోట్ల జీరో టిక్కెట్లు టీజీఎస్‌ఆర్‌టీసీ జారి చేసింది

0

* హైదరాబాద్‌లోనే రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు టీజీఎస్‌ఆర్‌టీసీ సేవలను వినియోగిస్తున్నారు.

హైదరాబాద్, జూన్ 24 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఇటీవలి డేటా ప్రకారం కేవలం 30% మంది ప్రయాణికులు మాత్రమే ఛార్జీలు చెల్లిస్తున్నారని, మహాలక్ష్మి పథకం కారణంగా రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది.

ఒక్క హైదరాబాద్‌లోనే, రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు TGSRTC సేవలను ఉపయోగిస్తున్నారు, వారిలో సుమారు 14 లక్షల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. అంటే నగరంలోని బస్సు ప్రయాణికుల్లో 70% మంది మహిళలు ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు 16 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. అయితే ఈ సంఖ్య ఇప్పుడు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు దాదాపు 54 కోట్ల జీరో టిక్కెట్లు జారీ అయ్యాయి.

TGSRTC యాజమాన్యం ఇటీవలి విశ్లేషణను నిర్వహించింది, ఇది తెలంగాణలో ప్రజా రవాణా వినియోగంపై మహాలక్ష్మి పథకం యొక్క గణనీయమైన ప్రభావాన్ని హైలైట్ చేసింది. పరిశోధనలు మహిళలకు ఆర్థిక ఉపశమనాన్ని అందించడంలో మరియు ప్రజా రవాణా యొక్క పెరిగిన వినియోగాన్ని ప్రోత్సహించడంలో పథకం పాత్రను నొక్కి చెబుతున్నాయి.

డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళా ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఈ చొరవ మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది మరియు మహిళా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రైవేట్ బస్సు బోల్తా..ఇద్దరు ప్రయాణికులు మృతి

హైదరాబాద్, జూన్ 23 : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు చక్రాల కింద నలిగిన ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులు ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదనికి గురైన మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుంది.

స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టడంతో సుమారుగా రెండు మూడు కిలోమీటర్లు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది బస్సును పక్కకు తొలగించారు.

 

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్

హైదరాబాద్, జూన్ 23 : హైదరాబాద్ లోని మియా పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో 144 సెక్షన్ అమల్లో ఉందని సైబరాబాద్ సిపి మహంతి తెలిపారు. ఈ పరిసర ప్రాంతాలలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో ఇంటి స్థలాలు ఇస్తున్నారని పెద్ద ఎత్తున జనాలను సమీకరి స్తున్నారని ఇలాంటి చర్యలు పాల్పడితే తీవ్రమైన చర్య లు ఉంటాయని వారు తెలిపారు.

ప్రభుత్వ స్థలంలో పూర్తిగా ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తు లకు కేసులు నడుస్తున్నా యని, వీటిపై ఎవరు మధ్య లో రావద్దని ఆయన తెలిపారు. ఇప్పటివరకు జరిగిన సంఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కారకులైన వ్యక్తులపై కఠమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

ఈ పర్యటనలో షేర్ లింగం పల్లి తాసిల్దారు వెంకారెడ్డి హెచ్ఎండిఏ ఆఫీసర్స్ మాదాపూర్ డిసిపి వినీత్ పోలీస్ రెవెన్యూ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

సామాన్య ప్రయాణికులకు రైల్వే సంస్థ గుడ్ న్యూస్

0

హైదరాబాద్, జూన్ 23 : మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్ ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2 కోచ్లు ఉన్న రైళ్లలో 4కు, జనరల్ కోచ్లు లేని రైళ్లకు 2 బోగీలను సమకూరుస్తామని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,377 స్లీపర్ క్లాస్ కోచ్లు, అదనంగా 2,500 జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఒక్కో కోచ్ లో 150-200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తెలిపింది.

కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటాం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, ( గచ్చిబౌలి ), జూన్ 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో గల పెద్ద చెరువులోకి భారీగా చేరిన కాలుష్యంతో ఆక్సిజన్‌ అందక చేపలు చనిపోయిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెరువు ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు నేరుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ద్వారా చెరువులోకి రావడంతో చేపలు మృతి చెందాయని భావించారు. కలుషిత నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, నగేష్, విక్రమ్, రంగస్వామి, రంగస్వామి, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

0

శేరిలింగంపల్లి,( చందానగర్ ), జూన్ 22 : చందానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం హత్య కేసు నమోదయింది. పోలీసుల వివరాలకు ప్రకారం.. మధ్యాహ్నం డయల్ 100 కాల్ వచ్చింది. చందానగర్‌లోని హుడా కాలనీ సాయిబాబా గుడి పక్కన ఉన్న ఓపెన్ ల్యాండ్‌లో ఒక మహిళ గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది అని పోలీస్ లు తెలిపారు. సుమారు 40-45 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నరు. ఆమె యష్ కలర్ లైనింగ్‌తో కూడిన సిల్వర్ కలర్ సింబల్స్ ప్రింట్ ఉన్న బ్లాక్ కలర్ చీర, బ్లాక్ కలర్ జాకెట్ & లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ మరియు మెడపై గుండ్రంగా ఉన్న రెడ్ కలర్ స్కార్ఫ్ ధరించింది ఉందని తెలిపారు.

ఆమె ఎడమచేతిపై బాలయ్య అనే టాటో ఉంది, మృత దేహాన్ని గమనించిన తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చు అని పోలీస్ లు అనుమానస్పదం వ్యక్తం చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే చందానగర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు.

సెల్-8008029073 – 9490617118.

 

డివిజన్ అభివృద్ధికి పెద్దపీట – కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ 

శేరిలింగంపల్లి, (మియాపూర్ ), జూన్ 22: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లో గల పలు సమస్యలతో పాటు చేపట్టవల్సిన అభివృద్ధి పనుల పై జిహెచ్ఎంసి అధికారులు E,E రాజు, HMWS&SB DGM నాగప్రియ, మేనేజర్ సునీత, A,E దుర్గాప్రసాద్, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో పర్యటించిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్.

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ కాలనీలో గల పలు సమస్యల పరిష్కారానికి అదేవిదంగా చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై పలు శాఖల సంబంధిత అధికారులను స్థానిక నాయకులు తో న్యూ కాలనీలో పలు సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగినది అని అన్నారు. న్యూ కాలనీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, కాలనీలలో తలెత్తినటువంటి డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, అధికారులకు తెలియజేయడం జరిగినది అని తెలిపారు.

నూతనంగా నిర్మాణం చేపట్టబోయే యూజిడి మరియు సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సౌకర్యాలు కలిపిస్తామని, మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు నవీన్, లింగయ్య, ఎస్ఆర్పి కనకరాజు, మహేష్, స్థానిక నాయకులు లక్ష్మణ్ గౌడ్ , కెఎస్ఎన్ రాజు, లావణ్య, వరలక్ష్మి, తిమ్మ రాజు, నరేష్ నాయక్, వెంకటేష్ గౌడ్ దుర్గేష్, జూపల్లి శంకర్, హైటెక్స్ రాజు, ఎం రాజేష్, శ్రీశైలం, రవి , అశోక్, జ్యోతి, లక్ష్మి, మహేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

డివిజన్ నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార తీసుకుంటాం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

శేరిలింగంపల్లి ( గచ్చిబౌలి ), జూన్ 22: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ లో సాయి ఐశ్వర్య కాలనీ కోర్పొరేటర్ గంగాధర్ రెడ్డి కాలనీ వాసులు కలిసితో పర్యటించారు. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకునీ సమస్యలపై సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, మంచినీటి సరఫరా పూర్తయిన ప్రాంతాల్లో సీసీ రోడ్డులు రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరారు.

స్థానికంగా ఉన్న మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందని, సరైన చర్యలు తీసుకోకపోవటం, శుభ్రం చెయ్యకపోవటం వల్ల తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నామని కాలనీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదేశించారు.

వెంటనే తగు చర్యలు తీసుకోని, మురుగు కాలువ పనులు చేపడాతమని కాలనీ వాసులకు గంగాధర్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్పొరోటర్ గంగాధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. అదేవిదంగా పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు.

పెరుగుతున్న జనాభా దృశ్య డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకోని రావాలని ప్రజలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో జి.హెచ్.ఎం.సి, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, సాయి ఐశ్వర్య రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసిషన్ కమిటీ సభ్యులు, ప్రభాకర్, అమిత్ భరద్వాజ్, భాగ్య లక్ష్మి, నర్సింహా మూర్తి, అశోక్ రాజు, రమణి రామ చంద్ర రావు, విజయ కుమార్, రమణి, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు రామ్ చందర్ రావు చిట్టి బాబు మహేష్, ఈశ్వర్, శ్రీధర్, విజయ్, సతీష్ చంద్ర మురళి, అతుల్, మనీష్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, తిరుపతి సీనియర్ నాయకులు, సుధాకర్ రాజేష్, అరుణ్ కృష్ణ బన్నీ, కిశోరె ఈశ్వరయ్య, సతీష్ నర్సింగ్ నాయక్, స్థానిక నేతలు, సాయి ఐశ్వర్య కాలనీ వాసులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య 

0

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం..రూపాదేవిని గురువారం రాత్రి కొందరు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉరి వేసుకుని కనిపించినట్లు తెలిపారు అని, ఆరోగ్య సమస్యల కారణంగానే ఆమె ఈ చర్య తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వారు అనుమానించారు. ఎం సత్యం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహా పలువురు ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు.