ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది

0

ఢిల్లీ, ఏప్రిల్ 30 : జూన్ 1 నుంచి వెస్టిండీస్ మరియు USAలో ఆతిథ్యం ఇవ్వనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టోర్నీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రిషబ్ పంత్, సంజూ శాంసన్ సహా ఇద్దరు వికెట్ కీపర్లను భారత్ జట్టులోకి చేర్చుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో పరుగులతో దూసుకుపోతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా జట్టులోకి వచ్చాడు.

16 నెలల తర్వాత పంత్ టీమ్ ఇండియాకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత్ నలుగురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు యుజ్వేంద్ర చాహల్‌లను ఎంపిక చేసింది. యుజ్వేంద్ర చాహల్ మొదటిసారి T20 ప్రపంచ కప్ కోసం జట్టులో ఎంపికయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ మరియు మహ్మద్ సిరాజ్‌లతో కూడిన జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని శక్తివంతమైన పేస్ అటాక్‌తో భారత్ టోర్నమెంట్‌లోకి వెళుతుంది. 15 మంది సభ్యుల జట్టులో శాంసన్‌కు చోటు లభించగా, సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ మరియు రింకూ సింగ్‌లను పట్టించుకోలేదు.

రిజర్వ్‌డ్‌ ప్లేయర్‌లుగా శుభమన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌లు ఎంపికయ్యారు.

భారతదేశం తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని జూన్ 05, 2024న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో ప్రారంభిస్తుంది, ఆ తర్వాత అదే వేదికపై జూన్ 09, 2024న పాకిస్తాన్‌తో మార్క్యూ క్లాష్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 12, 15 తేదీల్లో వరుసగా అమెరికా, కెనడాతో భారత్ ఆడుతుంది.

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ,అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్.

 

 

 

గచ్చిబౌలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా మాంజలి హనుమంతు

0

గచ్చిబౌలి, ఏప్రిల్ 29: గురు వారం రోజున శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా మాంజలి హనుమంతు ను నియమించటం జరిగింది. శేరిలింగంపల్లి ఇంచార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ చేవెళ్ల పార్లమెంటరీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి , పల్లపు సురేందర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో మాంజలి హనుమంతు మాట్లడుతూ కార్యకర్తలతో కలసి కాంగ్రెస్ పార్టీ ని ఎంపీ అభ్యర్థి ని గెలిపించుకుంటామని దానికి డివిజన్ కార్యకర్తల కృషి అవసరం అని వారితో కలిసి పని చేసి పార్టీకి మరింత వన్నె తెస్తామని ఈ సంధర్బంగా అయన తెలిపారు.

విద్వాన్ టీకే నారాయణ్ శత జయంతి వేడుకలు అలరించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు

0

మాదాపూర్, ఏప్రిల్ 28: త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కీర్తి శేషులు విద్వాన్ టీకే నారాయణ్ శత జయంతి, భరతనాట్య నృత్యాలయం నారాయణీ నాట్యాలయ 12వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువులు సంతోష్కుమార్ తమాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు భరతనాట్య నృత్యకారులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రత్యేకంగా అలరించారు. నాట్య గురువులు డాక్టర్ విజయ్ పథలోత్, అన్నారావులు హాజరై టీకే నారాయణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నృత్య ప్రదర్శనలిచ్చిన కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలంలో కాంగ్రెస్ లోకి భారీ వలసలు

0

*చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లీ మండలం లో కాంగ్రెస్ లోకి భారీ వలసలు.

*భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్.

*శంకర్ పల్లీ మండలం దొబీపేట్ గ్రామ పలు పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ సహోదరులు.

*పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన చేవెళ్ళ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.

చేవెళ్ల, ఏప్రిల్ 26 :  జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల నియోజక వర్గం లో భారీ మెజారిటీ సాధించే దిశగా చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్ పావులు కదుపుతున్నారు. అత్యంత ప్రతిష్ఠా త్మకంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రతి గ్రామాన్ని, ప్రతి నాయకుడిని పార్టీలకు అతీతంగా కలుస్తూ, వారిని కాంగ్రెస్ లోకి రప్పించడం లో భీమ్ భరత్ అహర్నిశలు కష్టపడుతున్నారు అని దానికి రోజు రోజుకు, ఆయా పార్టీల నుంచి గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ భీమ్ భరత్ నాయకత్వం పై నమ్మకం తో కాంగ్రెస్ లోకి భారీగా చేరుతున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, నిరంతరం నియోజక వర్గ అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తున్న భీమ్ భరత్ నాయకత్వ పటిమ పలు పార్టీల నాయకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమం లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తున్న భీమ్ భరత్ వెంట నడవడానికి వారంతా పార్టీలకు అతీతంగా తమ సంపూర్ణ మద్దతును తెలిపి భీమ్ భరత్ నాయకత్వం లో పనిచేయడానికి భారీగా కాంగ్రెస్ లోకి తరలి వస్తుండటం భీం భరత్ కృషికి నిదర్శనం.

ఆ క్రమంలో లోనే శుక్ర వారం నాడు భీమ్ భరత్ శంకార్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులు, మాజీ సర్పంచ్ లు తమ అనుచరులతో భీమ్ భరత్ సమక్షం లో చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా భీమ్ భరత్ వారిని సగౌరవంగా పార్టీ లోకి ఆహ్వానించారు. తన నాయకత్వం పై నమ్మకం తో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ తో విజయం సాధించి తమ సత్తా చస్తుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహిళా నాయకురాల్లూ, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…

చేవెళ్లలో సంకల్ప పత్రాన్ని విడుదల చేసిన బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి

0

చేవెళ్ల, ఏప్రిల్ 26 :  చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో పార్లమెంట్ స్థాయికి చెందిన సంకల్ప పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…చేవెళ్ల పార్లమెంటు స్థాయి నియోజకవర్గాల అభివృద్ధికి తను ఎప్పుడు తోడుపడతానని ఒక్కొక్క నియోజకవర్గానికి ఏమీ అవసరం ఉందో దాని కనుగుణంగానే తను మేనిఫెస్టోను తయారు చేసుకున్నట్లు ఆ విధంగానే తన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 

ప్రతి నిరుపేద కుటుంబానికి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని అలాగే ఇల్లు లేని కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని, చేవెళ్ల పార్లమెంటు స్థాయి లో మౌలిక సదుపాయాలను ఏర్పరుస్తామని హైదరాబాద్ ను, మెట్రోపాలిటన్ సిటీని చేస్తానని, లింగంపల్లి నుంచి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకు వస్తానని, బీజాపూర్ హైవేను నాలుగు లైన్ల రోడ్డును చేయిస్తానని అయన తెలిపారు.

తాండూర్ నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమలు ఏర్పాటుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, అక్కడ ఎక్కువ శాతం పండే కంది సాగుకు ఎంఎస్పీని అయ్యేవిధంగా ఏర్పాటు చేయిస్తానని, పరిగి నియోజకవర్గానికి మరియు రంగారెడ్డి జిల్లాకు నీటిని జూరాల ప్రాజెక్టు నుండి నేరుగా తీసుకొస్తానని ఆయన తెలిపారు. ఇంతకుముందే బీజాపూర్ హైవే గురించి కానీ పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు గురించి కానీ నేను పార్లమెంట్ లో నా గలం విప్పానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం జూరాల నుంచి నీటిని శ్రీశైలం తీసుకెళ్లి అక్కడి నుంచి ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరుగుతుందని దానికి వ్యయం ఎక్కువగా వెచ్చించి కాంట్రాక్టులకు సంబంధించిన ప్రాజెక్టుగా ఆయన అభిమానించారు కానీ అలా జరగకుండా దూరం తగ్గించి వ్యయం తగ్గించే విధంగా జూరాల నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లాలోకి నీటిని మళ్ళిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి 400 పైచిలుకు సీట్లను సాధిస్తుందని అందులో చేవెళ్ల కూడా ఒకటి ఉంటుందని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు.

రాజీనామా లేఖతో వచ్చా – రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు

0

హైదరాబాద్, ఏప్రిల్ 26:  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్‌ వద్దకు వచ్చానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని లేదంటే, రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని అన్నారు. మెదక్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న ఆయన హామీల అమలుపై సీఎం అమరవీరులస్తూపం వద్దకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హరీశ్‌రావు రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు.

మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు :  సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసగించే యత్నం జరుగుతుందని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లపై రాసిచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు రేవంత్‌ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ఇబ్బందిగా ఉంటే వారి పీఏ, సిబ్బందితో రాజీనామా లేఖను ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని, ఒకవేళ హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని హరీశ్‌రావు చెప్పారు. చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్‌ ఇవ్వాలని తెలిపారు. అలాగే తాను ఉపఎన్నికలో కూడా పోటీ చేయనని స్పష్టంగా చెప్పానని హరీశ్‌రావు అన్నారు.

టిప్పర్ ఢీ కొట్టి ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

0

గచ్చిబౌలి : ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతూ ఆగి ఉన్న టిప్పర్ను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం… వట్టినాగులపల్లిలో నివాసం ఉంటూ మేస్త్రీ పనులు చేసే పత్తావత్ హమ్యా(31) తన భావ మరిది విస్తావత్ మోతిలాల్(30)తో కలిసి బైక్ పై సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో గోపన్పల్లిలోని జర్నలిస్ట్ కాలనీకి వెళుతున్నారు. మార్గమద్యంలో శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కంకర లోడ్తో ఆగి ఉన్న టిప్పర్ (AP39UF3329)ను డీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న హమ్మా అక్కడికక్కడే మృతి చెందాడు. మోతిలాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారుతో బీభత్సం…

0

మద్యం మత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కారుతో బీభత్సం..

నాలుగు చోట్ల రోడ్డు ఆక్సిడెంట్..

ఒక కారు, మూడు బైకులు, ఆటో, పాదచారుడి ని ఢీ..

చికిత్స పొందుతూ పాద చారుడు మృతి..

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 500 పాయింట్స్..

 

హైదరాబాద్, ఏప్రిల్ 15 : ఐటీ కారిడార్ లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించాడు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నాలుగు చోట్ల ఒక కారు, మూడు బైకులు, ఒక ఆటో, రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న పాదచారి ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ గుర్తుతెలియని పాదచారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజాంపేట్ కి చెందిన క్రాంతి (30) ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో తన పోలో కారు(TS07EE6048)తో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు. ఐకియా ఫ్లైఓవర్, శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ మీదగా బయో డైవర్సిటీ వైపు దూసుకువెళ్తూ ఒక కారు, మూడు బైకులు, ఒక ఆటో ని ఢీకొట్టాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ఉన్న పిస్తా హౌస్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ పాదచారున్ని ఢీకొట్టాడు. అనంతరం రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఉన్న షేక్పెట్ ఫ్లైఓవర్ పై కారులో ఉన్న క్రాంతి ని స్థానికులు వెంబడించి పట్టుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ పాదచారి మృతి చెందాడు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు క్రాంతి కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 500 పాయింట్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో కారు, ఆటో, మూడు బైకులు ధ్వంసమయ్యాయి.

ముదిరాజ్ లకు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0

ఏప్రిల్ 15, హైదరాబాద్ :  ముదిరాజ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు పోరాడుతామని ప్రకటించారు. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచిలా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలనే కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే పదేళ్లు పాటు మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని* హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దొరలకు, పెత్తందారులకు మాత్రమే టికెట్ ఇవ్వలేదని.. పేదలకు, బీసీ కులాల వారికి టికెట్లు ఇచ్చి గెలిపించిందని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గకరీణ జరగాల్సిందే.. మాదిగలకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు.

తిరుపతి లో శ్రీ రామనవమి ఉత్సవాలు…

*ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు కోదండరామాలయంలో శ్రీ రామనవమి ఉత్సవాలు..

ఏప్రిల్ 15,తిరుపతి: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవార్లకు అభిషేకం, ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం :

ఏప్రిల్ 18న ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు అభిషేకం. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలన భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 19న శ్రీరామ పట్టాభిషేకం :

ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8-30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ బంగారు తరువాత తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఏప్రిల్ 20వ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు :

శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.