చేవెళ్ల, ఏప్రిల్ 26 : చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో పార్లమెంట్ స్థాయికి చెందిన సంకల్ప పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…చేవెళ్ల పార్లమెంటు స్థాయి నియోజకవర్గాల అభివృద్ధికి తను ఎప్పుడు తోడుపడతానని ఒక్కొక్క నియోజకవర్గానికి ఏమీ అవసరం ఉందో దాని కనుగుణంగానే తను మేనిఫెస్టోను తయారు చేసుకున్నట్లు ఆ విధంగానే తన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని అలాగే ఇల్లు లేని కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని, చేవెళ్ల పార్లమెంటు స్థాయి లో మౌలిక సదుపాయాలను ఏర్పరుస్తామని హైదరాబాద్ ను, మెట్రోపాలిటన్ సిటీని చేస్తానని, లింగంపల్లి నుంచి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకు వస్తానని, బీజాపూర్ హైవేను నాలుగు లైన్ల రోడ్డును చేయిస్తానని అయన తెలిపారు.
తాండూర్ నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమలు ఏర్పాటుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, అక్కడ ఎక్కువ శాతం పండే కంది సాగుకు ఎంఎస్పీని అయ్యేవిధంగా ఏర్పాటు చేయిస్తానని, పరిగి నియోజకవర్గానికి మరియు రంగారెడ్డి జిల్లాకు నీటిని జూరాల ప్రాజెక్టు నుండి నేరుగా తీసుకొస్తానని ఆయన తెలిపారు. ఇంతకుముందే బీజాపూర్ హైవే గురించి కానీ పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు గురించి కానీ నేను పార్లమెంట్ లో నా గలం విప్పానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం జూరాల నుంచి నీటిని శ్రీశైలం తీసుకెళ్లి అక్కడి నుంచి ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరుగుతుందని దానికి వ్యయం ఎక్కువగా వెచ్చించి కాంట్రాక్టులకు సంబంధించిన ప్రాజెక్టుగా ఆయన అభిమానించారు కానీ అలా జరగకుండా దూరం తగ్గించి వ్యయం తగ్గించే విధంగా జూరాల నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లాలోకి నీటిని మళ్ళిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి 400 పైచిలుకు సీట్లను సాధిస్తుందని అందులో చేవెళ్ల కూడా ఒకటి ఉంటుందని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు.