గచ్చిబౌలి : ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతూ ఆగి ఉన్న టిప్పర్ను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం… వట్టినాగులపల్లిలో నివాసం ఉంటూ మేస్త్రీ పనులు చేసే పత్తావత్ హమ్యా(31) తన భావ మరిది విస్తావత్ మోతిలాల్(30)తో కలిసి బైక్ పై సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో గోపన్పల్లిలోని జర్నలిస్ట్ కాలనీకి వెళుతున్నారు. మార్గమద్యంలో శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కంకర లోడ్తో ఆగి ఉన్న టిప్పర్ (AP39UF3329)ను డీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న హమ్మా అక్కడికక్కడే మృతి చెందాడు. మోతిలాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.