హైదరాబాద్, జూన్ 23 : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు చక్రాల కింద నలిగిన ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులు ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదనికి గురైన మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తుంది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టడంతో సుమారుగా రెండు మూడు కిలోమీటర్లు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది బస్సును పక్కకు తొలగించారు.