జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం – ఈసీ

0

*జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. 

*2024 లోకసభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.320 కోట్లు సీజ్.

హైదరాబాద్, మే 11 : 2024 సార్వత్రిక ఎన్నికల అన్ని దశలు జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు జరగనున్నాయి. కాబట్టి అప్పటివరకు అన్ని బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఎగ్జిట్ పోల్స్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత లోక్‌సభ సెగ్మెంట్లలో మే 13న పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరు నివసించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వలని లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మే 12, 13 తేదీల్లో ఎలక్ట్రానిక్‌, వెబ్‌ మీడియా సంస్థల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని, ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతితో మాత్రమే వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,509 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని, మే 13న ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తెలిపారు. 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామని, 20 వేల యూనిట్లను విడివిడిగా అందుబాటులో ఉంచామన్నారు. పోలింగ్ రోజు 164 కేంద్ర బలగాలతో పాటు మొత్తం 73,414 మంది సివిల్ పోలీసు సిబ్బంది, 500 మంది తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాలు, దాదాపు 90 వేల మంది అధికారులు హాజరావుతారని వికాస్ రాజ్ అన్నారు. 2024 లోకసభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.320 కోట్లు సీజ్ చేశామని, డ్రగ్స్ రవాణాకు సంబంధించి 200కు పైగా కేసులు నమోదు చేశామన్నారు.

 

 

మోదీకి 75 ఏళ్లు వచ్చినా ప్రధాని అవుతారు – అమిత్ షా

0

హైదరాబాద్, మే 11 : నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని, మూడోసారి కూడ ప్రధాన మంత్రిగా పూర్తి చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, సెప్టెంబర్ 17 తన పదవిలో చివరి రోజు అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాక్యాలకు అమిత్ షా స్పందించారు. మోదీకి 75 ఏళ్లు నిండినందుకు సంతోషించాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్‌కు, భారత కూటమికి అమిత్ షా సమాధానం ఇచ్చారు. మోదీజీ ప్రధాని కాలేరని బీజేపీ రాజ్యాంగంలో రాయలేదు అని మళ్లీ ఆయనే ప్రధాని అయ్యి తిరుతారని అమిత్ షా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

 

 

నియంతృత్వంపై పోరాడాలి – అరవింద్ కేజ్రీవాల్ 

0

న్యూఢిల్లీ, మే 11 : ఆరోపించిన మద్యం పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించి 50 రోజుల తర్వాత సుప్రీం కోర్టు జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తీహార్ జైలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ విడుదల అయ్యారు. మే 25న ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఓటు వేయనున్న ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ మరియు ఇండియా కూటమి కోసం ఆయన ప్రచారం చేయనున్నారు.

తీహార్ జైలు గేట్ నంబర్ 4 నుండి బయటకు వచ్చారు. కేజ్రీవాల్‌కు నినాదాలు చేస్తూ ఆప్ కార్యకర్తలు, అలాగే అతని భార్య సునీతా కేజ్రీవాల్, అతిషి, సౌరభ్ భరద్వాజ్ లు సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదల భారత కూటమికి అనుకూలంగా “గేమ్ ఛేంజర్” అవుతుందని భరద్వాజ్ మీడియా తో అన్నారు.

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరికీ, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మే 25న ఢిల్లీలో జరిగే ఎన్నికలను ఉదేశించి మాట్లాడుతూ..”నియంతృత్వం పై పోరాడి దేశాన్ని రక్షించండి” అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏడు దశల ఎన్నికలకు చివరి దశ ఓటింగ్ జరిగే జూన్ 1 వరకు కేజ్రీవాల్ బెయిల్‌పై ఉంటారు. జూన్ 2 నాటికి లొంగిపోవాల్సి ఉంటుంది. బెయిల్‌ను పొడిగించాలన్న అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది.

 

0

శేరిలింగంపల్లి, మే 10 :   లింగ వివక్షత, కులతత్వం 1200 వ శతాబ్దాలలో పోరాడిన గొప్ప వ్యక్తి మహత్మా బసవేశ్వరుడు అని శేరిలింగంపల్లి వీరశైవ లింగాయత్ సభ్యుడు, తెలంగాణ హకీ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. మహత్మా బసవేశ్వరుడి 890 జయంతి కార్యక్రమంను కొండ విజయ్ ఆద్వర్యంలో చందానగర్ హుడాకాలనీ లో నిర్వహించారు. ఈ  సందర్బంగా కొండ విజయ్ మాట్లాడుతూ  మహత్మా బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఓక్కరు నడుచుకోవాలని సూచించారు. స్వర్గం ఏక్కడో లేదని మానవుడు తాను చేసే పనిలో ఉంటుందని సమాజం పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహిళలకు చీరలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు రెవెన్యూ అసోసియేషన్ రాష్ర్చ మాజీ ఆద్యక్షుడు శివశంకర్ , మల్లిఖార్దున శర్మ, శివకుమార్, రవి అప్ప, ఉమేశ్, మల్లి ఖార్జున్, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

20వేలకు మించి నగదు ఇవ్వరాదు : RBI

0

హైదరాబాద్, మే 10 : రైజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కొత్తగా ఆదేశాలు జారి చేసింది. నగదు రూపంలో రూ.20వేలకు మించి ఎక్కువ మొత్తంలో ఎవరికీ రుణాలను ఇవ్వదు అని ఆర్బీఐ ప్రకటించింది. ఐటీ చట్టం 1961 లోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఈ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలని సూచించింది. నగదు చాలామణి కట్టడి చేయాలని, అదేవిదంగా డిజిటలైజేషన్ ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

దేవునితోడు మేము ఈసారి ఖచ్చితంగా ఓటు వేయం

0

భద్రాద్రి కొత్తగూడెం,మే10 : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గరిమెళ్ళపాడు గ్రామా ప్రజలు దాదాపు 200 మంది గ్రామంలోనే ధర్నా చేపట్టారు. ఆదివాసిలమైన మమ్మల్ని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకుండా ప్రతిసారి మోసం చేస్తున్నారని అందుకే దేవునితోడు మేము ఈసారి ఖచ్చితంగా ఓటును బహిష్కరిస్తాం అని చెప్తూ ప్లెక్సీ తో నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి. మధు గిరిజన సంఘాలకు చెందిన 200 మంది ఓటర్లు తో వారి సమస్యలను తెలుకొని ఓటు హక్కు ప్రాధాన్యత గురించి తెలిపాము అని ఈ సందర్బంగా ఆయన వివరణ ఇచ్చారు.

https://x.com/ANI/status/1788815122703487407

ఆరు నెలల తరువాత భక్తులకు దర్శనం

0

రుద్రప్రయాగ్, మే 10 : దేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటయిన కేదార్నాథ్ ధామ్ ఆరు నెలల తరువాత శుక్రవారం భక్తుల దర్శనార్ధం తలుపులు తెరుచుకున్నాయి. హర్ హర్ మహాదేవ్ అని భక్తులు మహాదేవుని దర్శనం కోసం పోటెత్తారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయ ప్రారంభ ఉత్సవలో దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులతో పటు పాల్గొన్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి తన భార్య గీత ధామితో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పలు సూచనలు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే యాత్రికులు సురక్షితంగా, సంతృప్తికరంగా ప్రయాణం సాగించాలని అయన ఆకాక్షించారు. ఆలయ ప్రారంభానికి ముందు ఆలయాన్ని 20 క్వింటాళ్ల పూలతో అలంకరించామని కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్మీ బ్యాండ్, సంప్రదాయ దప్పుల మధ్యలో భక్తి శ్రద్ధలతో ఊఖిమట్ లోని ఓంకారేశ్వర ఆలయంలోని శీతాకాల విడిది నుంచి కేదార్ నాథ్ కు తీసుకువెళ్లిన పంచముఖి డోలి అనే బాబా కేడర్ యొక్క పంచముఖి విగ్రహం కేదార్ధం కు చేరుకుంది అని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. సంద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో, ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకిని నదికి సమీపంలో కేదార్ నాథ్ ఆయలం ఉంది.

https://x.com/ANI/status/1788791805506465893

హైదరాబాద్‌ బస్సులో రాహుల్ గాంధీ,రేవంత్‌రెడ్డి ప్రచారం.

0

హైదరాబాద్, మే 10 : కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో ప్రయాణించి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పలు పథకాల గురించి ప్రయాణికులకు వివరించారు. నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద రాహుల్, సీఎం రెడ్డి ఆర్టీసీ బస్సు ఎక్కారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై రాహుల్ ఆరా తీశారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్ మరియు శ్రామిక్ న్యాయ్ గురించి రాహుల్ గాంధీ ప్రయాణికులకు వివరించారు. తెలంగాణలోని మెదక్‌లో గురువారం జరిగిన బహిరంగ ర్యాలీలో, కాంగ్రెస్ నాయకుడు కేంద్రంలో ప్రతిపక్ష కూటమి, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

 

ప్రధాని మోదీ నేడు హైదరాబాద్, మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు..

0

హైదరాబాద్, మే 10 : తెలంగాణలో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రంలో రెండు సభల్లో ప్రసంగించనున్నారు. నారాయణపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లలో జరిగే ఎన్నికల ర్యాలీలకు మోడీ హాజరవుతారని పార్టీ తెలిపింది.

17 లోక్‌సభ స్థానాలకు ప్రచారంలో అగ్రనేతలు-మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రంలో ప్రచారాలు తీవ్ర స్థాయికి చేరుకుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సింగిల్ ఫేజ్ పోలింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

 

10 నిమిషాల్లో మీ ఇంటికి వెండి,బంగారం పొందండి ఇలా..

0

హైదరాబాద్, మే 9 : క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు బిగ్‌బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరియు జెప్టో లు మనకు ఇంటికి కావాల్సిన సరుకులు, స్టేషనరీ, బుక్స్ మరియు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని 10 నిముషాలలో అందిస్తున్న ఈ క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పుడు బంగారం వెండిని కూడ డెలివరీ చేస్తున్నాయి. మే 9న అక్షయ తృతీయ సందర్భంగా మే 10న వెండి మరియు బంగారు నాణేలను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కొనుగోలు చేసిన బంగారం మరియు వెండి నాణేలు 24 క్యారెట్, 999 గోల్డ్ కాయిన్‌తో వస్తాయి. వెండి నాణేలు కూడా 999 స్వచ్ఛతతో ఉంటాయి.

స్విగ్గి దాని శీఘ్ర వాణిజ్య ప్లాట్‌ఫారమ్ స్విగ్గి ఇంస్టామర్ట్ ద్వారా కస్టమర్‌లకు నాణేలను డెలివరీ చేయడానికి మలబార్ గోల్డ్ & డైమండ్స్, ముత్తూట్ ఎగ్జిమ్ (ముత్తూట్ పప్పాచన్ గ్రూప్)తో భాగస్వామ్యం కలిగి ఉంది. అదేవిదంగా బిగ్‌బాస్కెట్ నౌ బంగారం, వెండి నాణేలను పంపిణీ చేయడానికి తనిష్క్,MMTC-PAMPతో భాగస్వామ్యం కలిగి ఉంది. జెప్టో కూడ Nek జ్యువెలరీతో భాగస్వామ్యంతో ఉందని Xలో ప్రకటించింది.