ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ

0

హైదరాబాద్, (శేరిలింగంపల్లి) : నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పత్రిక ఎస్ జయరాం, అదనపు ఉప పోలీసు కమీషనర్, మాదాపూర్ జోన్, సైబరాబాదు ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఎదురయ్యే అనర్థాలను వివరించి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతి సంవత్సరం 1988 మే 31నుండి ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం నినాదం పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల 18 రకాల క్యాన్సర్ లకు గురవడంతో పాటు గుండె జబ్బులు, టీబీ, ఊపిరితిత్తులు, అల్సర్, ఉదరకోశ వ్యాధులు, కిడ్నీ , మధుమేహం, దంత, నోటివ్యాధుల లాంటి వాటి బారిన పడతారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి, హాని కలుగుతుంది. ఈ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా జీవన ప్రమాణం తగ్గుతుంది. యువతి యువకులలో ఈ ఉత్పత్తుల వినియోగం వల్ల నపుంసకత్వం పెరిగి, సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారని, తాజా నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగ విధానం, పొగ వెలువరించేలా వాడడం, (సిగరెట్లు, బీడీలు, చుట్ట, హుక్కా) లాంటి వాటి ద్వారా, మరియు పొగ లేకుండా వాడడం, ఇందులో పొగాకు ఉత్పత్తులైన (పొగాకు నమలడం, గుట్కా, జర్ద, ఖైని, తంబాకు) వంటి వాటి రూపంలో వాడుతూ ఉంటారు. పొగాకు పొడిని ముక్కు ద్వారా పీల్చుతూ ఉంటారు.

పొగాకు, పొగాకు ఉత్పత్తులు ఏ రూపంలో ఉపయోగించినా, పైన ఉదాహరించిన వ్యాధులకు గురవుతారు. పొగ త్రాగే వారి కంటే దానిని పీల్చే వారికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. వారితో పాటు వీరికి కూడా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. దీనినే ‘సెకండ్ హ్యాండ్ స్మోకింగ్’ అని అంటారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల మన దేశంలో లక్షలాదిమంది, ప్రపంచంలో కోట్లాదిమంది మరణాల పాలవుతున్నారు. దీనితో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కావున మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. “ఆరోగ్యమే మహాభాగ్యం”. కావున మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మద్యపానానికి, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, నిత్యం వ్యాయామం, మెడిటేషన్, యోగ, నడక మొదలగునవి కనీసం 40 నిమిషాలు చేయాలి.

సాధ్యమైనంత మేర తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారంతో పాటు, పౌష్టిక ఆహారం తీసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ విధమైన అనారోగ్యముగా ఉన్నా , అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, G. V. రావు, బాలన్న, నేమాని విశ్వశాంతి, జీకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో దాడులు – ఆహార భద్రత కమిషనర్

0

హైదరాబాద్,మే 19: తెలంగాణ ఆహార భద్రత శాఖ టాస్క్‌ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని టాప్ రెస్టారెంట్లలో శనివారం తనిఖీలు నిర్వహించింది. రాయలసీమ రుచులు వద్ద, బృందం మైదాలో నల్ల బీటిల్స్, పురుగులు సోకిన చింతపండు, గడువు ముగిసిన అమూల్ గోల్డ్ పాలు, లేబుల్ లేని జీడిపప్పు, జోవర్ రోటీలను గుర్తించారు. అంతేకాకుండా, రెస్టారెంట్‌లో అక్రమ నిల్వ పద్ధతులు కూడా ఉన్నాయి. వంటగది ప్రాంతంలో మూసుకుపోయిన కాలువ మరియు కిటికీలు తెరవడం వంటి పరిశుభ్రత సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్‌లలో ఒకటైన షా ఘౌస్‌లో లేబుల్ చేయని తయారు చేసిన/సెమీ-తయారు చేసిన ఆహారం నిల్వలో కూడా కనుక్కున్నారు. అదనంగా, తనిఖీ సమయంలో నీరు నిలిచిపోవడం వంటి పరిశుభ్రత సమస్యలు కూడా బయటపడ్డాయి. హోటల్ సుఖా సాగర్ వెజ్ రెస్టారెంట్ విషయంలో, JK బటన్ మష్రూమ్ ప్యాకెట్లు తయారీ మరియు వినియోగ తేదీలు లేకుండా కనుగొనబడ్డాయి.

 

భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ 

0

హైదరాబాద్, మే 18 : తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని భూవివాదంపై ఉద్రిక్తత నెలకొనడంతో అదుపులోకి తీసుకున్న పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ లు స్టేషన్ కు తరలించారు.

కొంపల్లిలోని సుచిత్ర సమీపంలోని సర్వే నంబర్ 82లోని 1.1 ఎకరాల భూమికి సంబంధించి మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డికి ఇతరులతో గొడవ జరిగింది. భూమి తమదేనంటూ మల్లారెడ్డి తన మద్దతుదారులతో సరిహద్దు కంచెను తొలగించారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా అక్కడే ఉన్న పోలీసు అధికారుల సమక్షంలోనే తొలగించారు. మల్లారెడ్డి ఆ భూమిలోకి ప్రవేశించి కొందరితో వాగ్వాదానికి దిగడం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో, మల్లా రెడ్డి తన భూమిని కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులతో చెప్పాడు.

వాదోపవాదాలు ముదరడంతో, పోలీసులు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఒప్పించి, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు పోలీస్ లు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

త్వరలో 522 వాహనాలు వేలం – సైబరాబాద్ కమిషనరేట్‌

0

హైదరాబాద్‌, మే 16 : సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పేరుకుపోయిన 522 పాడుబడిన/క్లెయిమ్‌ చేయని వివిధ రకాల వాహనాలను త్వరలో వేలం వేయనున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. సైబరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ యాక్ట్ 2004 ఆర్/డబ్ల్యు సెక్షన్ యొక్క అధికార u/s 6(2), 7 ప్రకారం బహిరంగ వేలం ద్వారా ఈ వాహనాలను తీసివేయాలని ప్రతిపాదించబడింది.

ఈ వాహనాలకు సంబంధించి ఎవరికైనా యాజమాన్యం/హైపోథెకేషన్ అభ్యంతరం ఉంటే, వారు సైబరాబాద్ కమిషనరేట్‌లోని పోలీస్ కమిషనర్‌లో దరఖాస్తు చేసి నోటిఫికేషన్ తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. విఫలమైతే పాడుబడిన / క్లెయిమ్ చేయని వాహనాలు బహిరంగ వేలం నిర్వహించబడతాయి తెలిపారు.

వాహనాల వివరాలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో ఎన్ వీరలింగం, MTO-2, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సెల్ నెం.9490617317, సైబరాబాద్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

కొత్త మహీంద్రా XUV 3XO బుకింగ్‌లు ప్రారంభం

0

హైదరాబాద్, మే 16 :  మహీంద్రా & మహీంద్రా ఇటీవల భారతదేశంలో తన కొత్త కాంపాక్ట్ SUV XUV 3XO ను విడుదల చేసింది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త మోడల్ అనేక బెస్ట్-ఇన్-క్లాస్ మరియు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్లతో లభిస్తుంది. కొత్త SUV కోసం బుకింగ్‌లు (15 మే 2024) నుండి ప్రారంభమయ్యాయి. బుకింగ్‌లకు సంబంధించి మరింత సమాచారం కోసం, కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా నేరుగా షోరూమ్‌ని సంప్రదించవచ్చు అని సంస్థ తెలిపింది. XUV 3XO మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూతో నేరుగా పోటీపడుతుంది.

కొత్త మహీంద్రా SUV మూడు ఇంజన్ లలో అందిస్తుంది. మొదటి ఇంజన్ 1.0L టర్బో పెట్రోల్ వేరియంట్, ఇది 74kW పవర్ అవుట్‌పుట్ మరియు 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, రెండవ ఇంజన్ ఎంపిక ఉంది, 1.2L టర్బో పెట్రోల్, 96kW శక్తిని మరియు 200 Nm టార్క్‌ను అందిస్తుంది. మూడవ ఇంజన్ 1.5L టర్బో డీజిల్ వేరియంట్, ఇది 86kW శక్తిని మరియు 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి మరియు 21.2 km/l వరకు మైలేజీని అందిస్తాయి.

కొత్త XUV 3XO బోల్డ్ ఫ్రంట్ డిజైన్, సైడ్ మరియు రియర్ ప్రొఫైల్‌ల నుండి ప్రీమియం అనుభూతిని కలిగి ఉంది. ఇది Android ఆటో, Apple క్యాప్లయ్ కి మద్దతు ఇచ్చే 26.03 cm ట్విన్ HD స్క్రీన్‌ను కలిగి ఉంది. భద్రతా లక్షణాలలో లెవెల్ 2 ADAS, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఇది విశాలమైన స్థలాన్ని కూడా అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు మరియు లాంగ్ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉంటుంది.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవ వేడుకలు

0

హైదరాబాద్, శేరిలింగంపల్లి, మే 15 : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల పద్మా రెసిడెన్సీ అపార్ట్ మెంట్స్ (ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర) నందు ఫ్లోరెన్స్ నైటింగేల్  జయంతి వేడుకలను దేవానంద్ యాదవ్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ చిత్రానికి పుష్పాంజలి ఘటించి, క్రొవ్వొత్తులను వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ (సివిల్ సర్జన్, ఆర్థో, జిల్లా వైద్యశాల, రంగారెడ్డి జిల్లా) విచ్చేసి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ (NIMS, TIMS, SD EYE Hospital, CGHS, Urdu University Health Centre, HCU Health Centre, District Hospital Kondapur, Lingampally Primary Health Centre, Urban Health Centre Hafeezpet, BHEL General Hospital, ESI RC Puram, Area Hospital Patanchetu)వైద్యశాలలలో పనిచేస్తూ ఉత్తమ సేవలందించిన సేవామూర్తులైన 80 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం తో (జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్ఛం) ఘనంగా సత్కరించి తదనంతరం మాట్లాడుతూ.. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుండి సేవాతత్వాన్ని అలవరచుకున్న వ్యక్తి నైటింగేల్ అని అన్నారు. మానవసేవే మాధవసేవగా భావించి మానవులకు సేవ చేయడానికి నర్సు వృత్తి సరైనదని భావించి ఈ వృత్తిని ఎంచుకొని ఆనాటి సమాజ కట్టుబాట్లను ఎదిరించి ఎన్నో కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నటువంటి ధీశాలి.

ఆ రోజులలో ఆసుపత్రులు శుచీ శుభ్రత లేకుండా చాలా అధ్వాన్నంగా ఉండేవి. ఆవిడ జర్మనీ, ఐర్లాండ్ దేశాలలో తాను పనిచేసిన హాస్పిటళ్ళలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారు. 1854 – 56 ప్రాంతంలో క్రీమియాలో ఘోర యుద్ధం జరిగినప్పుడు క్షతగాత్రులైన సైనికులకు నిరుపమానమైన సేవలు అందించి వారికి ధైర్యం చెప్పేది. సహచర నర్సులను తీసుకుని రాత్రి సమయంలో దీపం తీసుకుని క్షతగాత్రులైన సైనికుల వద్దకు వెళ్ళి వారికి వైద్య సహయాలను అందించి ఆ సైనికుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచింది. ఈ కారణంగా ఆవిడను ‘లేడీ విత్ ల్యాంప్’ అంటూ గౌరవించేవారు. ఆ సైనికులలో ఆత్మస్థైర్యాన్ని నింపి మరణాల సంఖ్య తగ్గించారు. ఆమె అనేక గ్రంథాలయాలను ఏర్పాటు చేసి అక్షరాస్యతకై విశేష కృషి చేశారు. ఆవిడ 1860 జూన్ 24న  క్రిస్టియన్స్కూల్ ఫర్ నర్సెస్’ లండన్ లో స్థాపించడం జరిగింది. ఆమె నోట్స్ ఆన్ నర్సింగ్, నోట్స్ ఆన్ హాస్పిటల్స్ అనే గ్రంథాలను రచించారు.

నర్సులను సన్మానిస్తున్నా అసోసియేషన్ సభ్యులు

అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్ పై పేపర్ ప్రజంటేషన్స్ చేయడం జరిగింది. అప్పటినుండే నర్సులకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వడం అనే విధానం ప్రారంభించబడింది. ఆమెను మదర్ ఆఫ్ మోడ్రన్ నర్సింగ్ గా గుర్తించారు. ఆవిడ భారతదేశానికి కూడా ఇతోధిక సేవలు అందించారు. విక్టోరియా రాణి సూచనల మేరకు భారతదేశంలో జరుగుతున్న అధిక మరణాలకు కారణం సరైన శానిటరీ వ్యవస్థ లేకపోవడమే అని ఆవిడ గుర్తించి అవసరమైన శానిటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరణాల రేటును తగ్గించ గలిగింది. ఆవిడ మన మధ్య లేకపోయినా సేవానిరతి కలిగిన ప్రతి నర్సులోను ఆవిడ కలకాలం జీవించి ఉంటుంది. నర్సులు, రోగులు గుర్తుంచుకోవలసిన ఆదర్శమూర్తి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్ ‘ అని అన్నారు. నర్సింగ్ వృత్తి ఆవిర్భావానికి, గౌరవానికి ప్రతీక మరియు ఆవిడ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆవిడ గౌరవార్థం ఆవిడ జన్మదినమైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవముగా ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం ‘మన నర్సులు – మన భవిష్యత్తు, నర్సులే మన ఆర్థిక,సామాజిక శక్తి సంరక్షకులు’ అనే నినాదంతో నిర్వహించుకుంటున్నాము అని తెలిపారు. ఈనాడు సమాజంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నర్సుల కొరత ఉంది. నేటి యువతీ యువకులు నర్సింగ్ కోర్సులలో ఉన్నత విద్యను అభ్యసించిన యెడల దేశ విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున దానిపై దృష్టి సారించాలి అని కోరారు.

ఈ సందర్భంగా నర్సులందరి చేత ఆవిడ జీవితాన్ని సేవానిరతిని ఆదర్శంగా తీసుకొని మనసా, వాచా, కర్మణా రోగులకు సేవలందిస్తామ ని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దేవానంద్ యావద్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజయలక్ష్మి, వాణీ సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, వెంకటేశ్వర్లు, బాలన్న, జిల్ మల్లేష్, M. S. రావు, శ్రీమతి సంతోషి, లక్ష్మీ మరియు నర్సులు పాల్గొన్నారు.

కుక్కదాడిలో 5 నెలల పసికందు మృతి 

0

వికారాబాద్, మే 15 : వికారాబాద్ జిల్లాలో మే 14 మంగళవారం నాడు వీధికుక్క దాడికి ఐదు నెలల పసికందు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. శిశువు తల్లి తన రోజువారీ పనులను పూర్తి చేయడానికి వారి ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు సమీపంలోని స్టోన్ పాలిషింగ్ యూనిట్‌లో పనిచేశారు. పసికందు చనిపోయిందని తెలియగానే కోపోద్రిక్తులైన నివాసితులు ఆ కుక్కను అక్కడికక్కడే చంపేశారు.

 సి.బి.ఎస్.ఇ 10వ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రభంజనం

0

శేరిలింగంపల్లి, మే 14 : స్థానిక నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాల సి.బి.ఎస్.ఇ 10వ. తరగతి ఫలితాల్లో విజయకేతం ఎగురవేసింది. శ్రీ చైతన్య పాఠశాలలో టాప్ మార్కును (491/500) అందించి తల్లిదండ్రుల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంది. కె.అవని ఉపాసన 491/500(98.2%), . 2 487/500, 5. 0 ໖໖ 483/500, M. 483/500, 2. 482/500, 3. 481/500, ໖.໑໖ $478/500, 2.5478/500, 5. 477/500 మార్కులు సాధించి ముందంజలో ఉన్నారు. 481/500.

పాఠశాలలో విద్యార్థులు అందరూ 75% పైన మార్కులు సాధించారని, 100% ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ యు. వాణి గారు తెలిపారు. ఇంతటి ఘన విజయం సాదించడానికి విద్యార్థుల నిరంతర కృషి వారి తల్లిదండ్రుల సహకారము,ఉపాధ్యాయుల సృజనాత్మక బోధన, పర్యవేక్షణ, వ్యక్తిగత శ్రద్ధ, శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం సూచనలు, సలహాలు, నడిపించే విధానము ముఖ్య కారణమని ఆమె కొనియాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఏ. జీ.యం. శివరామకృష్ణ, ఆర్.ఐ. అనితా మేడమ్, ప్రిన్సిపల్ యు. వాణి, ఉన్ నాగరాజు, టెన్త్ క్లాస్ ఇన్చార్డ్ ఎం.కె. రంగ విజయం సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

విజయవంతంగా కొనసాగుతున్న రత్నగిరి ఫౌండేషన్ సమ్మర్ క్యాంప్

0

*టేబుల్ టెన్నిస్.బాస్కెట్ బాల్ గేమ్స్ లో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరచిన మంత్రి జూపల్లి.

హైదరాబాద్, మే 14 : విద్యార్థులు చదువుతోపాటు వ్యాయామం ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని ప్రతిరోజు ఉదయాన్నే లేవడం వల్ల మానసిక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు నేటి ఉదయం కొల్లాపూర్ పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులతో కలిసి వివిధ గేమ్స్ లలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు,టేబుల్ టెన్నిస్,బాస్కెట్ బాల్,వాలీబాల్,గేమ్స్ ఆడుతున్న విద్యార్థులతో కలిసి మమేకమయ్యారు.

వీటితో పాటు స్విమ్మింగ్ కూడా ముఖ్యమని త్వరలోనే పెండింగ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి వ్యాయామం అంత ముఖ్యమని వ్యాయామం చేయడం వల్ల మన మెదడు చురుకుగా ఉంటుందని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ కు ఇంతమంది చిన్నారులు రావడం సంతోషమని మరిన్ని కార్యక్రమాలను రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ట్రైనర్స్ మగ్బూల్, నాగరాజు, ఉమాపతి, రవి, సురేష్ వారితోపాటు ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ సి యు లో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

0

హైదరాబాద్, మే 12 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ఒక రోజు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఓహెచ్)లో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను పెంచడానికి, రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా వారాల తరబడి ప్రచారం చేసిన తర్వాత,ఇండియా’ జెర్సీని ధరించి రేవంత్ రెడ్డి వర్సిటీలోని ప్లేగ్రౌండ్లో విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడారు.