హైదరాబాద్, మే 9 : క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు బిగ్‌బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరియు జెప్టో లు మనకు ఇంటికి కావాల్సిన సరుకులు, స్టేషనరీ, బుక్స్ మరియు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని 10 నిముషాలలో అందిస్తున్న ఈ క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పుడు బంగారం వెండిని కూడ డెలివరీ చేస్తున్నాయి. మే 9న అక్షయ తృతీయ సందర్భంగా మే 10న వెండి మరియు బంగారు నాణేలను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కొనుగోలు చేసిన బంగారం మరియు వెండి నాణేలు 24 క్యారెట్, 999 గోల్డ్ కాయిన్‌తో వస్తాయి. వెండి నాణేలు కూడా 999 స్వచ్ఛతతో ఉంటాయి.
స్విగ్గి దాని శీఘ్ర వాణిజ్య ప్లాట్‌ఫారమ్ స్విగ్గి ఇంస్టామర్ట్ ద్వారా కస్టమర్‌లకు నాణేలను డెలివరీ చేయడానికి మలబార్ గోల్డ్ & డైమండ్స్, ముత్తూట్ ఎగ్జిమ్ (ముత్తూట్ పప్పాచన్ గ్రూప్)తో భాగస్వామ్యం కలిగి ఉంది. అదేవిదంగా బిగ్‌బాస్కెట్ నౌ బంగారం, వెండి నాణేలను పంపిణీ చేయడానికి తనిష్క్,MMTC-PAMPతో భాగస్వామ్యం కలిగి ఉంది. జెప్టో కూడ Nek జ్యువెలరీతో భాగస్వామ్యంతో ఉందని Xలో ప్రకటించింది.