బాపట్ల, అక్టోబర్ 16 : బాపట్ల డిఫోకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ డి. సాంబశివరావు చనిపోయారు.
బస్సు పొలంలోకి దూసుకు వెళ్లే సమయంలో ముందు వెళుతున్న సైకిల్ ను డీ కొట్టింది.. ఈ ప్రమాదంలో సైకిల్ పై వెళ్తున్న పిట్టు వెంకటేశ్వరరెడ్డి కాలికి తీవ్ర గాయమైంది.
బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండగా అందరూ క్షేమంగా ఉన్నారు.