ముంబయి, జులై 18 : ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని బయటకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అన్వీ మరణించింది. కాగా అన్వీకి సోషల్ మీడియాలో సుమారు 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.