హైదరాబాద్, మే 8 : ఐపీఎల్ లో భాగంగా బుధవారం లాక్నో తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి పై 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై లక్నో ని చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్ లో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 166 పరుగుల చేధనకు దిగిన హైదరాబాద్ ఓపెనర్లు లక్నో బౌలర్లు పై ఏ మాత్రం జాలి చూపలేదు. మొదటి బంతి నుండి బాదడం మొదలుపెట్టిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 9.4 ఓవర్లకే 166 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో జట్టును ఆయుష్ బదోని, నీకొలస్ పూరన్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు. ఆయుష్ బదోని 30 బంతుల్లో 55 పరుగులు చేయగా, నీకొలస్ పూరన్ 26 బంతుల్లో 48 పరుగులు చేసి గ్రిస్ లో నిలిచారు.
A stylish strike to end a stylish chase!
Simply special from the #SRH openers 🤝
Recap the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvLSG pic.twitter.com/2xUlOlS1kk
— IndianPremierLeague (@IPL) May 8, 2024