రాజన్న – సిరిసిల్ల, మే 8 : తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో చారిత్రాత్మక శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. బుధవారం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయంలో ప్రసిద్ధి చెందిన “కోడెమొక్కును” ను కూడా సమర్పించారు. కానీ ఆలయానికి సంబంధించి ప్రధాని ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్థానిక ప్రజల, భక్తులు నిరాశ చెందారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఆలయ ధర్మకర్తలో ఒకరు కానీ అయన ప్రధాన మంత్రిగా ఉన్నపుడు ఆలయాన్ని సందర్శించలేదు అని స్థానికులు చర్చించుకుంటున్నారు.