Friday, December 20, 2024
HomeSportsPRO KABADDIతెలుగు టైటాన్స్‌ జోరు తమిళ్‌ తలైవాస్‌పై విజయం

తెలుగు టైటాన్స్‌ జోరు తమిళ్‌ తలైవాస్‌పై విజయం

*తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం 

అదరగొట్టిన పవన్‌ సెహ్రావత్‌. 

*1000 పాయింట్ల క్లబ్‌లో సచిన్‌. 

హైదరాబాద్‌, ది న్యూస్ టుడే,నవంబర్‌ 06 : ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 35-34 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

పీకేఎల్‌-8వ సీజన్‌ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్‌ నార్వల్‌(9), విజయ్‌ మాలిక్‌(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్‌ జట్టులో సచిన్‌ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్‌(4), నరేందర్‌(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్‌లో సచిన్‌ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్‌ విజయంతో టైటాన్స్‌ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్‌ 21 పాయింట్లతో మూడులో ఉంది.

ఇరు జట్లు హోరాహోరీగా..

లీగ్‌ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి.

ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్‌ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్‌ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్‌ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్‌ 18వ నిమిషంలో విజయ్‌ మాలిక్‌ రైడ్‌తో టైటాన్స్‌ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్‌ కూడా జతకలువడంతో టైటాన్స్‌ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది.

మ్యాచ్‌ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్‌ ఇద్దరిని పవన్‌ ఔట్‌ చేయడం ద్వారా తలైవాస్‌ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్‌ 11వ నిమిషంలో కిషన్‌, అశిష్‌ను ఔట్‌ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్‌ రైడర్‌ అశిష్‌ నార్వల్‌..అభిషేక్‌ను ఔట్‌ చేసి పాయింట్‌ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్‌ సూపర్‌ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.

పవన్‌, సచిన్‌ దూకుడు: 

ఓవైపు టైటాన్స్‌ తరఫున పవన్‌, మరోవైపు తలైవాస్‌కు సచిన్‌ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్‌ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్‌..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్‌ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్‌ 14వ నిమిషంలో టైటాన్స్‌ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్‌ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్‌ ఔట్‌ కావడంతో తలైవాస్‌ గెలుపు ఆశలపై టైటాన్స్‌ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్‌, సచిన్‌ రైడింగ్‌ జోరు అభిమానులను కట్టిపడేసింది.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments