*జాతీయ స్పీడ్ రోలర్ స్కేటింగ్ లో 2 రజత పతకాలు.సాధించిన హైదరాబాద్ విద్యార్ధి
హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్ 12 : మైసూర్ లో డిసెంబర్ 05 నుంచి 11 వరకు జరిగిన 62వ జాతీయ స్పీడ్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్-2024లో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన గుడ్ల అర్ణవ్ 2 రజత పతకాలతో మొదటి స్థానంలో నిలిచాడు. సికింద్రాబాద్ మచ్చబొల్లారానికి చెందిన గుడ్ల అర్ణవ్ ఆల్వాల్ లోని భాష్యం స్కూల్ లో 5 వ తరగతి చదువుతున్నాడు. కాగా అర్ణవ్ ఇప్పటి వరకు జిల్లా నుండి 3 రజత పథకాలు,రాష్ట్ర స్థాయిలో 5 బంగారు పథకాలు సాధించాడు. ఓపెన్ నేషనల్ స్కేటింగ్ రేసింగ్ లో 2 రజత పతకాలు సాధించాడు.