నారాయణ పేట్, జూన్ 14: ఊట్కూరు మండలం,చిన్న పోర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. భూతగాదాలలో ఓ రైతు నిండు ప్రాణం బలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, ఆ రైతును కర్రలతో కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 100 కు డయల్ చేసిన రెస్పాండ్ గాని పోలీసులు.ఒక నెల క్రిందట స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ చేశారు.తన భర్తను కర్రలతో కొడుతుంటే అటు పోలీసులు గాని, గ్రామస్తులు గాని ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నం,చేయలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.