హైదరాబాద్, (శేరిలింగంపల్లి), జూన్ 25 : యువత మంచి మార్గాన్ని ఎంచుకుని సమాజా నిర్మాణం తో పాటు సేవలో మొదటి మెట్టుగా నిలవాలనే శ్రీ కృష్ణ యూత్ ఆశయం అని వ్యవస్థాపకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
తన పుట్టిన రోజును పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి రోడ్డు నెంబర్ ఒకటిలో ఎన్నో ఏళ్ళుగా పూరి గుడిసెలో నివాసమయంటున్న నిరుపేద కుటుంబానికి శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శ్రీ.అభిషేక్ గౌడ్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చు 3లక్షల రూపాయలతో రెండు గదుల రేకుల ఇల్లుని నిర్మించి ఇంటిని శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ వారికి బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ కృష్ణ యూత్ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి మరియు ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి తన భుజాలపై వేసుకొని ఒక నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి వారి జీవితంలో ఒక కలను సాకారం కావడానికి తోడ్పడిని శ్రీ కృష్ణ అధ్యక్షులు,సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.రాజు, కె.కుమార్, కె.భిక్షపతి, జి.యాదగిరి, మెహమ్ముద, అబ్దుల్ సత్తార్, ఫారీద్, సయ్యద్ పాషా, రాఘవ చారి, లడ్డు, రాములు, అనిల్, టి.జయరాం, గణేష్, మహేష్, హరీష్, శ్రవణ్ చారి తదితరులు పాల్గొన్నారు.