హైదరాబాద్, జూన్ 19: తన లైంగిక వాంఛ తీర్చేందుకు నిరాకరించిన కారణంగా యుక్తవయసులో ఉన్న కుమార్తెను హత్య చేసిన కేసును మియాపూర్ పోలీసులు చేధించారు.
హైదరాబాద్ లోని మియాపూర్ ప్రాంతం నడిగడ్డ తండాకు చెందిన నరేష్ జూన్ 7న తన కూతురు తప్పిపోయిందని తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నిర్మణుషంగా ఉన్న ప్రాంతంలో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యమైంది. నరేష్ అతని భార్య అది తమ కూతురిదిగా గుర్తించారు.
ఈ దశలోనే కిడ్నాప్ కమ్ మర్డర్‌గా మారిన మిస్సింగ్ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన ఇన్‌స్పెక్టర్ వి దుర్గా రామ లింగ ప్రసాద్ వివరాల ప్రకారం.. నరేష్ తన కుమార్తెతో కలిసి మోటర్‌బైక్‌పై అటవీ ప్రాంతానికి వెళ్లాడని, ఒంటరిగా తిరిగి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం మీద అతన్ని విచారించగా నరేష్ తన కుమార్తెను చంపినట్లు అంగీకరించాడు అని, అతనికి పోర్న్ చూడటం అలవాటుగా మారడం వల్ల తన కుమార్తెతో లైంగిక సంబంధం కలిగి ఉండాలని కోరుకునట్లు తెలిపారు.
జూన్ 7న కట్టెలు సేకరిస్తానని చెప్పి నరేష్ తన కూతురిని తీసుకెళ్లి అనంతరం ఆమె పై ఆత్యాచారం చేసి బండరాయితో కొట్టి హతమార్చడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసులోని సెక్షన్లను 302,201,376 r/w 511 IPC మరియు 5, 6 r/w 18 POCSO చట్టం ప్రకారం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.