హైదరాబాద్, జూన్ 20: మైనింగ్ వ్యాపారానికి సంబంధించి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సోదరుడు జి మధుసూధన్ రెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. మధుసూదన్ రెడ్డికి సంబంధించిన క్వారీ కంపెనీతో సహా దాదాపు ఏడు స్థలాల్లో సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు పిటిఐకి తెలిపాయి.
అక్రమ మైనింగ్ ఆరోపణలపై రాష్ట్ర పోలీసు ఎఫ్ఐఆర్ నుండి మనీలాండరింగ్ పై ఈడీ కేసు వరకు వచ్చింది. తన కంపెనీల ద్వారా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవల మధుసూధన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్‌పై మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్‌ఓ) ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈడీ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.