హైదరాబాద్, న్యూస్ టుడే 25 : బాణాసంచా విక్రయదారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నుంచి తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది తెలిపారు.
ఈ లైసెన్స్ లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విక్రేతలు తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం పౌర సేవా కేంద్రాలలో లేదా GHMC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ లైసెన్స్‌ను పొందడం కోసం విక్రేతలు తమ ఆధార్ లేదా పాన్ కార్డ్ కాపీలను గుర్తింపు రుజువుగా సమర్పించాలి ఆయన తెలిపారు. అదనంగా, నివాస ప్రాంతాలలో లేదా ఫుట్‌పాత్‌లలో దుకాణాలను ఏర్పాటు చేయవద్దని కమిషనర్ ఇలంబరిది సూచించారు.
ఇలా ఏర్పాటు చేసిన షాపుల దగ్గర పటాకులు కాల్చకూడదని, ఏదైనా ప్రమాదాలు జరిగితే విక్రేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్‌లో స్పష్టంగా పేర్కొన్న షరతును కూడా ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.