రంగారెడ్డి, హైదరాబాద్, న్యూస్ టుడే 25 : రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో విషాదం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య.
7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి బలవన్మరణం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.
ఆంద్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కోకాపేట్ లో హాస్టల్ గదికి వచ్చి తనువు చాలించిన నాగ ప్రభాకర్. నాగ ప్రభాకర్ ఆత్మహత్య కు గల కారణాలు లను విచారిస్తున్న పోలీసులు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తూ…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.