Wednesday, October 23, 2024
HomeHyderabadకేంద్ర మంత్రులకు స్వాగతం పలికిన రవికుమార్ యాదవ్ 

కేంద్ర మంత్రులకు స్వాగతం పలికిన రవికుమార్ యాదవ్ 

శేరిలింగంపల్లి, జూన్ 20 : కేంద్ర మంత్రులుగా పదోన్నతి పొంది సొంత రాష్ట్రానికి విచ్చేయుచున్న కేంద్ర మంత్రులకు ఘనంగా స్వాగతం పలికిన శేరిలింగంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇన్చార్జి రవి కుమార్ యాదవ్.

నరేంద్రమోడీ మంత్రిమండలిలో కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా పదవులు పొంది సొంత రాష్ట్రానికి విచ్చేయుచున్న గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు రవికుమార్ యాదవ్ కార్యకర్తలతో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి అంచెలంచెలుగా పదవులు పొందుతూ.. మాలాంటి ఎంతోమందికి అవకాశాలు కల్పించిన మన ప్రధానమంత్రి మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా నూతనంగా కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తమ సొంత రాష్ట్రానికి విచ్చేసి కేంద్ర మంత్రులకు ,ముఖ్య నేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని, 2029 లో జరిగే సాధారణ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, కార్యకర్తలు మరియు నాయకులు కూడా కంకణ బద్ధులై పార్టీ నిర్ణయించిన విధివిధానాలను పాటిస్తూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం సాగుతూ ఉంటుందని ఈ సందర్బంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, జిల్లా,రాష్ట్ర నాయకులు,కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, మహిళ మోర్చా, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments