Saturday, July 27, 2024
HomeHyderabadకష్టపడితే రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు - రఘునాథ్ యాదవ్

కష్టపడితే రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చు – రఘునాథ్ యాదవ్

హైదరాబాద్, జూన్ 4 :  సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్.

జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాంటి ఉత్కంఠ బరమైన సమయంలో సాయన్న కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత హఠాత్తుగా కాలం చేయడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మరొక్కసారి ఉప ఎన్నికల నగర మోగింది. కంటోన్మెంట్ నాయకుడు శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనితో బై ఎలక్షన్స్ కి నాంది పలికినట్లు అయ్యింది. అటువైపు బిఆర్ఎస్ నుండి లాస్య నందిత సోదరి నివేదిత సాయన్న, బిజెపి నుంచి వంశ తిలక్ అభ్యర్థులుగా పార్టీలు ప్రకటించాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కూడా జిహెచ్ఎంసి పరిధి కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఎవరు నాయకత్వం వహించి కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ ని గెలిపించటానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని రంగంలోకి దింపింది. ఓవైపు ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆమె సోదరికి విపరీతమైన సానుభూతి కంటోన్మెంట్ కలిగింది. ఎన్నికలకు 15 రోజుల ముందు కంటోన్మెంట్ ఇంచార్జ్ గా వచ్చిన యువ నాయకుడు రఘునాథ్ యాదవ్.

మొదటి రోజు నుంచే కంటోన్మెంట్ లోని కిందిస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర నాయకుల వరకు అందరిని కలుపుకుపోతూ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచాడు. బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా అన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా కంటోన్మెంట్ ప్రజలతో కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా దగ్గరయ్యాడు రఘునాథ్ యాదవ్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సలహాలు, సూచనలు తీసుకొని దాదాపు 15 రోజులు రఘునాథ్ యాదవ్ వారి అనుచరులతో తీవ్రంగా కష్టపడి, కార్యకర్తలకు అవసరమున్నప్పుడల్లా పక్కనే ఉంటూ, వారికి ధైర్యాన్ని నింపాడు. ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచే ప్రణాళికలు గెలుపుకు కావలసిన వ్యూహాలు సిద్ధం చేసుకుని కంటోన్మెంట్ రాజకీయ చరిత్రనే చక్రం తిప్పాడు యువ నాయకుడు రఘునాథ్ యాదవ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు లో ముమ్మాటికి తెర ముందు రఘునాథ్ యాదవ్ ఉంటే తెర వెనుకాల నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృషి, పట్టుదల పూర్తిస్థాయిలో ఎంతో ఉందని చెప్పవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా పట్టుదలతో కష్టపడితే రాజకీయాలలో చక్రం తిప్పవచ్చని నిరూపించిన రఘునాథ్ యాదవ్.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments