*చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లీ మండలం లో కాంగ్రెస్ లోకి భారీ వలసలు.
*భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్.
*శంకర్ పల్లీ మండలం దొబీపేట్ గ్రామ పలు పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ సహోదరులు.
*పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన చేవెళ్ళ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.
చేవెళ్ల, ఏప్రిల్ 26 : జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల నియోజక వర్గం లో భారీ మెజారిటీ సాధించే దిశగా చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్ పావులు కదుపుతున్నారు. అత్యంత ప్రతిష్ఠా త్మకంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రతి గ్రామాన్ని, ప్రతి నాయకుడిని పార్టీలకు అతీతంగా కలుస్తూ, వారిని కాంగ్రెస్ లోకి రప్పించడం లో భీమ్ భరత్ అహర్నిశలు కష్టపడుతున్నారు అని దానికి రోజు రోజుకు, ఆయా పార్టీల నుంచి గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ భీమ్ భరత్ నాయకత్వం పై నమ్మకం తో కాంగ్రెస్ లోకి భారీగా చేరుతున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, నిరంతరం నియోజక వర్గ అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తున్న భీమ్ భరత్ నాయకత్వ పటిమ పలు పార్టీల నాయకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమం లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తున్న భీమ్ భరత్ వెంట నడవడానికి వారంతా పార్టీలకు అతీతంగా తమ సంపూర్ణ మద్దతును తెలిపి భీమ్ భరత్ నాయకత్వం లో పనిచేయడానికి భారీగా కాంగ్రెస్ లోకి తరలి వస్తుండటం భీం భరత్ కృషికి నిదర్శనం.
ఆ క్రమంలో లోనే శుక్ర వారం నాడు భీమ్ భరత్ శంకార్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన గ్రామ, మండల స్థాయి నాయకులు, మాజీ సర్పంచ్ లు తమ అనుచరులతో భీమ్ భరత్ సమక్షం లో చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా భీమ్ భరత్ వారిని సగౌరవంగా పార్టీ లోకి ఆహ్వానించారు. తన నాయకత్వం పై నమ్మకం తో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ తో విజయం సాధించి తమ సత్తా చస్తుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహిళా నాయకురాల్లూ, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…