హైదరాబాద్, ది న్యూస్ టుడే, డిసెంబర్ 12: మెదడులో ఏర్పడిన అత్యంత క్లిష్టమైన ట్యూమర్ (మెడులో బ్లాస్టోమా)ను హైటెక్ సిటీ మెడికవర్ దవాఖాన వైద్యులు విజయవంతంగా తొలగించి 12 ఏండ్ల ఆక్షర ప్రాణాలు కాపాడారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం దవాఖానలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు.
అక్షర తరగతి గదిలో తరచుగా నిద్రపోవడం గుర్తించిన ఉపాధ్యాయులు తల్లితండ్రులకు తెలియజేశారు. చిన్నారి వైద్యులకు చూపించగా ఆమె చిన్న మెదడు భాగంలో మెడులోబ్లాస్టోమా అను ట్యూమర్ను గుర్తించారు. కాగా ట్యూమర్ తొలగింపు అత్యంత క్లిష్టమైనదని, శస్త్ర చికిత్స సమయంలో పక్షవాతం లేదా ప్రాణాపాయం వంటి సమస్యలున్నప్పటికీ మెడికవర్ వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ట్యూమర్ను తొలగించారు.
చికిత్స అనంతరం అక్షర హైడ్రోసెఫలస్ అనే సమస్యకు గురవడంతో వెంట్రికులో పెరిటోనియల్ (వీపీ) షంట్ సర్జరీని చేశారు. సర్జరీ అనంతరం అక్షర వెచ్చింది. మూడు నెలలుగా కోమాలో ఉన్న అక్షరకు మెరుగైన చికిత్స అందిస్తుండడంతో ఆకస్మాత్తుగా మేల్కొని తన తండ్రితో మాట్లాడింది. అనంతరం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా, అక్షర కోలుకున్నట్లు, ట్యూమర్ సైతం పూర్తిగా తొలగిపోయినట్లు నిర్ధారించినట్లు వైద్యులు తెలిపారు.