ఏప్రిల్ 15, హైదరాబాద్ : ముదిరాజ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు పోరాడుతామని ప్రకటించారు. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచిలా పోరాడుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చాలనే కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే పదేళ్లు పాటు మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని* హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దొరలకు, పెత్తందారులకు మాత్రమే టికెట్ ఇవ్వలేదని.. పేదలకు, బీసీ కులాల వారికి టికెట్లు ఇచ్చి గెలిపించిందని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గకరీణ జరగాల్సిందే.. మాదిగలకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు.