గచ్చిబౌలి, జూన్ 20: శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ అంజయ్యనగర్, సిద్ధిక్నగర్ కాలనీల్లో కొనసాగుతున్న ఆక్రమ నిర్మాణాలను అరికట్టాలంటూ శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్రెడ్డికి సిద్దిక్నగర్ వాసులు వినతిపత్రం అందజేశారు. రోడ్లను ఆక్రమిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా 5 అంతస్తులకు పైగా నిర్మాణాలను కొనసాగిస్తుండడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు డీసీకి తెలిపారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీ రజినీకాంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. 60 నుంచి 100 గజాలలో 6 అంతస్తులు నిర్మిస్తుండడంతో డ్రైనేజీ, మంచినీటి, పార్కింగ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిర్మాణాలపై నుంచి ఇటుకలు, స్త్రీలు పడుతుండడంతో పక్కన వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. వినతి అందజేసిన వారిలో కొండాపూర్ బీజేపీ ఎస్సీ మోర్చ ప్రెసిడెంట్ చందు, కాలనీ వాసులు శంకర్, రాజు, విజయ్, యాదయ్య, కేతన్, తదితరులు ఉన్నారు.