హైదరాబాద్, మే 6 : 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం మీడియా ప్రతినిధులతో హైదరాబాద్ కమిషనర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం నగరంలోని కీలక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తామని తెలిపారు.
ఎన్నికల సంఘం హైదరాబాద్‌కు 22 కంపెనీల సెంట్రల్ పోలీసులను అందించిందని, క్రిటికల్ స్పాట్‌లుగా వర్గీకరించబడిన ఏఎస్‌డి (ఆబ్సెంట్ షిఫ్టెడ్ & డెడ్) పోలింగ్ స్టేషన్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని కమిషనర్ తెలిపారు. ఎన్నికల తేదీన, 192 పోలీసు పికెట్లు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు (క్యూఆర్‌టి), స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్), మరియు ఇంటెలిజెన్స్ కలెక్షన్ టీమ్‌లు పోలింగ్ ప్రక్రియలో మోహరించబడతాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహిస్తామని హైదరాబాద్ సీపీ తెలిపారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)తో కూడిన స్ట్రాంగ్ రూమ్‌లకు సీఏపీఎఫ్, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఔటర్ సెక్యూరిటీ రింగ్‌లో సాధారణ పోలీసులు భద్రత కల్పిస్తారని శ్రీనివాస రెడ్డి తెలిపారు. అదేవిదంగా పోలీసులు ఇప్పటి వరకు రూ. 18 కోట్ల నగదు, రూ. నగరంలో వాహన తనిఖీల్లో రూ.12 కోట్ల విలువైన బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అని తెలిపారు.