పెద్దపల్లి, జూన్ 14: సుల్తానాబాద్ మండల శివార్లలో గురువారం రాత్రి రైస్‌మిల్లు కార్మికుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హృదయ విదారకంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు బలరాం మైథా రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలి తల్లిదండ్రులు పక్కనే ఉన్న మమత రైస్‌మిల్లులో పనిచేస్తున్నారు.
బాలిక తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తుండగా బలరాం బాలికను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బలరాం తన భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న దృశ్యం రైస్‌మిల్లు ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
రాత్రి నిద్ర లేచి చూసేసరికి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బాలిక కోసం వెతకగా సమీపంలోని పొదల్లో మృతదేహం కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.