మాదాపూర్, ఏప్రిల్ 28: త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కీర్తి శేషులు విద్వాన్ టీకే నారాయణ్ శత జయంతి, భరతనాట్య నృత్యాలయం నారాయణీ నాట్యాలయ 12వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువులు సంతోష్కుమార్ తమాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు భరతనాట్య నృత్యకారులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రత్యేకంగా అలరించారు. నాట్య గురువులు డాక్టర్ విజయ్ పథలోత్, అన్నారావులు హాజరై టీకే నారాయణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నృత్య ప్రదర్శనలిచ్చిన కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.