హరిద్వార్, అక్టోబర్ 17 : జైలులో రామాయణ నాటకం.. వానరుల వేషంలో సీతను వెతకటానికి వెళ్లి ఇద్దరు ఖైదీల పరార్.
హరిద్వార్ జైలులో రామాయణ నాటకం వేయగా రావణుడు.. సీతను అపహరించుకుపోయిన సన్నివేశం ముగిసిన తరువాత వానర సభ్యలు సీతని కోసం వెతకడం మొదలు పెట్టారు.
ఆ సమయంలో ఖైదీలు పంకజ్, రాజ్ కుమార్ ఇద్దరూ జైలు గోడపై వెతకడం మొదలు పెట్టారు. అది నాటకంలో భాగమని ప్రేక్షకులు, పోలీసులు నోరెళ్ళబెట్టి చూస్తుండగా.. వారు ఇద్దరూ గోడ దూకి పారిపోయారు.
చివరకు సీత దొరికినప్పటికీ వారిద్దరూ మాత్రం దొరకలేదు.