హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న అక్రమ కట్టడాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం కూల్చివేశారు. జగన్ భద్రత కోసం ఈ నిర్మాణాలు అప్పట్లో నిర్మించగా, పూర్తిస్థాయి కూల్చివేతలు పోలీసుల సమక్షంలో కొనసాగించారు.