హైదరాబాద్, సెప్టెంబర్ 17 : హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డూ ధర రూ.30,01,000/- వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న సింగిల్ విండో ఛైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి.
బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొన్న ఆరుగురు సభ్యులు. గత ఏడాది 27 లక్షలు పలకగా.. ఈ ఏడాది 3 లక్షలు అధికంగా పలికిన బాలాపూర్ లడ్డూ.
గతేడాది ఈ లడ్డూను రూ.27 లక్షలకు వేలంలో దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు.
హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర..1994 నాటిది. స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు కొనుగోలు చేశారు.1994లో వేలంలో రూ.450 వెళ్లిన లడ్డు క్రమంగా పెరిగి ఈ ఏడాది రూ.30 లక్షలు దాటింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే కుటుంబం అనేక సార్లు వేలంపాటల్లో పాల్గొని అనేక సందర్భాల్లో విజయవంతంగా గెలుపొందింది.
వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
1994 నుండి 2024 వరకు హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో గణేష్ లడ్డును పొందిన వారి జాబితా క్రింది విధంగా ఉంది..
సంవత్సరంలో బిడ్డర్ మొత్తం రూ.లలో
* 1994 కొలన్ మోహన్ రెడ్డి 450
* 1995 కొలన్ మోహన్ రెడ్డి 4,500
* 1996 కొలన్ కృష్ణా రెడ్డి 18,000
* 1997 కొలన్ కృష్ణా రెడ్డి 28,000
* 1998 కొలన్ మోహన్ రెడ్డి 51,000
* 1999 కళ్లెం అంజి రెడ్డి 65,000
* 2000 కళ్లెం ప్రతాప్ రెడ్డి 66,000
* 2001 జి రఘునందన్ చారి 85,000
* 2002 కందాడ మాధవ రెడ్డి 1,05,000
* 2003 చిగిరింత బాల రెడ్డి 1,55,000
* 2004 కొలన్ మోహన్ రెడ్డి 2,01,000
* 2005 ఇబ్రమ్ శేఖర్ 2,08,000
* 2006 చిగిరింట తిరుపతి రెడ్డి 3,00,000
* 2007 జి రఘునందన్ చారి 4,15,000
* 2008 కొలన్ మోహన్ రెడ్డి 5,07,000
* 2009 సరిత 5,10,000
* 2010 కొడాలి శ్రీధర్ బాబు 5,35,000
* 2011 కోలన్ బ్రదర్స్ 5,45,000
* 2012 పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000
* 2013 తీగల కృష్ణా రెడ్డి 9,26,000
* 2014 సింగి రెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000
* 2015 కళ్లెం మధన్ మోహన్ రెడ్డి 10,32,000
* 2016 కందాడి స్కైలాబ్ రెడ్డి 14,65,000
* 2017 నాగం తిరుపతి రెడ్డి 15,60,000
* 2018 తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా 16,60,000
* 2019 కొలన్ రామ్ రెడ్డి 17,60,000
* 2020 ముఖ్యమంత్రికి అందించబడింది
* 2021 రమేష్ యాదవ్ & మర్రి శశాంక్ రెడ్డి 18,90,000
* 2022 వంగేటి లక్ష్మా రెడ్డి 24,60,000
* 2023 దాసరి దయానంద రెడ్డి 27,00,000
* 2024 బాలాపూర్ కొలన్ శంకర్ రెడ్డి 30,01,000