Saturday, January 11, 2025
HomeHyderabadప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్, (శేరిలింగంపల్లి) : నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పత్రిక ఎస్ జయరాం, అదనపు ఉప పోలీసు కమీషనర్, మాదాపూర్ జోన్, సైబరాబాదు ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఎదురయ్యే అనర్థాలను వివరించి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతి సంవత్సరం 1988 మే 31నుండి ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరం నినాదం పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల 18 రకాల క్యాన్సర్ లకు గురవడంతో పాటు గుండె జబ్బులు, టీబీ, ఊపిరితిత్తులు, అల్సర్, ఉదరకోశ వ్యాధులు, కిడ్నీ , మధుమేహం, దంత, నోటివ్యాధుల లాంటి వాటి బారిన పడతారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి, హాని కలుగుతుంది. ఈ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా జీవన ప్రమాణం తగ్గుతుంది. యువతి యువకులలో ఈ ఉత్పత్తుల వినియోగం వల్ల నపుంసకత్వం పెరిగి, సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారని, తాజా నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగ విధానం, పొగ వెలువరించేలా వాడడం, (సిగరెట్లు, బీడీలు, చుట్ట, హుక్కా) లాంటి వాటి ద్వారా, మరియు పొగ లేకుండా వాడడం, ఇందులో పొగాకు ఉత్పత్తులైన (పొగాకు నమలడం, గుట్కా, జర్ద, ఖైని, తంబాకు) వంటి వాటి రూపంలో వాడుతూ ఉంటారు. పొగాకు పొడిని ముక్కు ద్వారా పీల్చుతూ ఉంటారు.

పొగాకు, పొగాకు ఉత్పత్తులు ఏ రూపంలో ఉపయోగించినా, పైన ఉదాహరించిన వ్యాధులకు గురవుతారు. పొగ త్రాగే వారి కంటే దానిని పీల్చే వారికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. వారితో పాటు వీరికి కూడా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. దీనినే ‘సెకండ్ హ్యాండ్ స్మోకింగ్’ అని అంటారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల మన దేశంలో లక్షలాదిమంది, ప్రపంచంలో కోట్లాదిమంది మరణాల పాలవుతున్నారు. దీనితో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కావున మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. “ఆరోగ్యమే మహాభాగ్యం”. కావున మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మద్యపానానికి, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, నిత్యం వ్యాయామం, మెడిటేషన్, యోగ, నడక మొదలగునవి కనీసం 40 నిమిషాలు చేయాలి.

సాధ్యమైనంత మేర తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారంతో పాటు, పౌష్టిక ఆహారం తీసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ విధమైన అనారోగ్యముగా ఉన్నా , అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, G. V. రావు, బాలన్న, నేమాని విశ్వశాంతి, జీకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments