హైదరాబాద్, అక్టోబర్ 17 : న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. అవును మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అత్యున్నత ధర్మాసనంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేకపోవడంతో ఈ అంశం వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. ఇన్నాళ్లూ న్యాయ దేవత రెండు చేతుల్లో.. కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉండటం గమనార్హం.
సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతోనే న్యాయదేవత విగ్రహంలో సుప్రీం కోర్టు ఈ
మార్పులుచేర్పులు చేసింది. అయితే ఇన్నాళ్లూ న్యాయదేవత విగ్రహం కళ్లకు, గంతలు కట్టడం, చేతిలో ఖడ్గం, ఉంచడం వెనక కారణం లేకపోలేదు.