హైదరాబాద్, అక్టోబర్ 11 : తెలంగాణలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి నివేదించిన తర్వాత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి) గా భాద్యతలు స్వీకరించారు.
మహమ్మద్ సిరాజ్‌కు ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 ప్రభుత్వ పదవిని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిరాజ్ బాధ్యతలు స్వీకరించడంతో ఆ హామీ నెరవేరింది.
ఇది కాకుండా ఐసిసి టి 20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెటర్‌కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే.