*టేబుల్ టెన్నిస్.బాస్కెట్ బాల్ గేమ్స్ లో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరచిన మంత్రి జూపల్లి.
హైదరాబాద్, మే 14 : విద్యార్థులు చదువుతోపాటు వ్యాయామం ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని ప్రతిరోజు ఉదయాన్నే లేవడం వల్ల మానసిక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు నేటి ఉదయం కొల్లాపూర్ పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులతో కలిసి వివిధ గేమ్స్ లలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు,టేబుల్ టెన్నిస్,బాస్కెట్ బాల్,వాలీబాల్,గేమ్స్ ఆడుతున్న విద్యార్థులతో కలిసి మమేకమయ్యారు.
వీటితో పాటు స్విమ్మింగ్ కూడా ముఖ్యమని త్వరలోనే పెండింగ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి వ్యాయామం అంత ముఖ్యమని వ్యాయామం చేయడం వల్ల మన మెదడు చురుకుగా ఉంటుందని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్ కు ఇంతమంది చిన్నారులు రావడం సంతోషమని మరిన్ని కార్యక్రమాలను రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ట్రైనర్స్ మగ్బూల్, నాగరాజు, ఉమాపతి, రవి, సురేష్ వారితోపాటు ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.