హైదరాబాద్, (శేరిలింగంపల్లి), జూన్ 25 : ఇటీవల కేంద్ర మంత్రులుగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి (కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ), కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ (కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి) అదేవిదంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డి.కే అరుణ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం.రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ ఢిల్లీలోని వారి నివాసంలో ప్రత్యక్షంగా కలిసి శాలువతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మాట్లాడుతూ..ఢిల్లీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులను కలువడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గం అభివృద్ధికి తమ వంతు కృషి ఉంటుందని తెలిపారని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిలో కూడ బిజెపి మరింత బలపడడానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మాదాపూర్ కంటేస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి కంటేస్టెడ్ కార్పొరేటర్ ఏల్లెష్ తదితరులు పాల్గొన్నారు.