మాదాపూర్, జూన్ 6: భోజన ప్రియులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రముఖ పాన్ ఏషియా ఫో (ఎఫ్ఎఓ) రెస్టారెంట్ను గురువారం హైటెక్ సిటీలోని ఇనార్బిటాల్లో ప్రారంభించారు. పెబెల్ స్ట్రీ హాస్పిటాలిటీ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రియాన్ థామ్, కో – ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కీనన్ థామ్లు హాజరై రెస్టారెంట్ను ప్రారంభించారు. మినీ ఇండియాగా ఉన్న హైటెక్సిటీ, ఐటీ కారిడార్లోని ప్రజలకు పాన్ ఇండియా వంటకాలను రుచి చూపించేందుకు తమ రెస్టారెంట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు థామ్ బ్రదర్స్ తెలిపారు. అద్భుతమైన రుచితో పాటు పూర్తి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో ఫో రెస్టారెంట్ పేరు గాంచిందన్నారు. ఇండియా బిజినెస్ సెంటరైన ముంబైలో తమ రెస్టారెంట్ ప్రథమ వరుసలో ఉందని, అదే తరహాలో ఇక్కడి ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెబెల్ స్ట్రీట్ హాస్పిటాలిటీ చీఫ్ కలినరీ ఆఫీసర్ చెఫ్ ఎర్రిక్ సిఫ్ తదితరులు పాల్గొన్నారు.