శేరిలింగంపల్లి, జూన్ 20 : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కమీషనర్, ఆరోగ్య & కుటుంబ సంక్షేమశాఖ మరియు మిషన్ డైరెక్టర్, NHM, తెలంగాణ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా డిప్యూటీ DMHO డాక్టర్ సృజన ముఖ్య అతిథులుగా హాజరైయి విద్యార్థి, విద్యార్థినులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ ని వేశారు. అనంతరం ఉచిత నోట్ బుక్స్, స్కూల్ యూనిఫార్మ్స్ ను పంపిణి చేశారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…విద్యార్దిని విద్యార్దులను ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆరోగ్యవంతమైన భారత దేశాన్ని మనం తయారు చేయాలని ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
నులిపురుగుల దినోత్సవం సందర్బంగా 1-19 సం.ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కోరారు. నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని నియంత్రించడానికి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే త్రాగుట, పండ్లను మరియు కాయగూరలను శుభ్రమైన నీటితో కడుగుట, భోజనం చేసేముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడంతో పాటు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ZPHS ఇంచార్జి HM భాస్కర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందర్, CHO చిలివేరి స్వామి, HE బలరాం, సబ్ యూనిటీ ఆఫీసర్ శ్రీనివాస్, ZPHS ఉపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, శివ కుమార్, కరుణ, గోపాల్, చంద్ర ప్రకాష్ రెడ్డి, బలరాం, మహేందర్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఆశ వర్కర్ లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.