రుద్రప్రయాగ్, మే 10 : దేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటయిన కేదార్నాథ్ ధామ్ ఆరు నెలల తరువాత శుక్రవారం భక్తుల దర్శనార్ధం తలుపులు తెరుచుకున్నాయి. హర్ హర్ మహాదేవ్ అని భక్తులు మహాదేవుని దర్శనం కోసం పోటెత్తారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయ ప్రారంభ ఉత్సవలో దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులతో పటు పాల్గొన్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి తన భార్య గీత ధామితో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పలు సూచనలు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే యాత్రికులు సురక్షితంగా, సంతృప్తికరంగా ప్రయాణం సాగించాలని అయన ఆకాక్షించారు. ఆలయ ప్రారంభానికి ముందు ఆలయాన్ని 20 క్వింటాళ్ల పూలతో అలంకరించామని కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్మీ బ్యాండ్, సంప్రదాయ దప్పుల మధ్యలో భక్తి శ్రద్ధలతో ఊఖిమట్ లోని ఓంకారేశ్వర ఆలయంలోని శీతాకాల విడిది నుంచి కేదార్ నాథ్ కు తీసుకువెళ్లిన పంచముఖి డోలి అనే బాబా కేడర్ యొక్క పంచముఖి విగ్రహం కేదార్ధం కు చేరుకుంది అని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. సంద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో, ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకిని నదికి సమీపంలో కేదార్ నాథ్ ఆయలం ఉంది.
https://x.com/ANI/status/1788791805506465893