శేరిలింగంపల్లి, (గచ్చిబౌలి ), జూన్ 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో గల పెద్ద చెరువులోకి చేరిన కాలుష్యం కారణంగా చేపలు చనిపోయినా విషయం, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు నేరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా చెరువులోకి విడిచారని, దీంతో చేపలు మృతి చెందాయని పేర్కొన్నారు.
కలుషిత నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి స్పందిస్తూ..గ్రామం నుంచి వెలువడే కలుషిత నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా చెరువులోకి వచ్చే మురుగు నీటి నిర్మూలనకు శాశ్వత పరిష్కారినికి ఇక పై తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, శేఖర్, రంగస్వామి, రంగస్వామి, మహేష్, నగేష్, విక్రమ్, టింకు, గోవర్థన్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.